ఓ పక్క ఇంకా కరోనా కేసులు తగ్గనే లేదు.. కొత్త స్ట్రెయిన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో ముప్పు ముంచుకొచ్చింది. పలుచోట్ల పక్షులకు బర్డ్ ఫ్లూ సోకుతున్న విషయం తెలిసిందే. అయితే మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకింది. ఇప్పటికే రష్యాలో ఓ కేసును గుర్తించారు వైద్యులు. బర్డ్ ఫ్లూకు కారణమయ్యే వైరస్ ను మనుషుల్లో గుర్తించినట్టు రష్యాలోని వెక్టార్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సాధారణంగా ఇన్ ఫ్లూయెంజా ఎ వైరస్ లోని H5N8 స్ట్రెయిన్ కారణంగా పక్షులకు బర్డ్ ఫ్లూ సోకుతుంది. అయితే రష్యాలోని ఓ వ్యక్తిలో వైద్యులు ఈ వైరస్ ను గుర్తించారు.
మానవుల్లో తొలి బర్డ్ ఫ్లూ కేసు ఇదేనని రష్యా శాస్త్రవేత్తలు అంటున్నారు. బర్డ్ ఫ్లూ చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ వైరస్ కారణంగా వేలసంఖ్యలో పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. అయితే ఇప్పటివరకు ఈ వైరస్ మనుషుల్లో కనిపించలేదు. కానీ తొలిసారిగా మనుషుల్లోనూ ఈ వైరస్ ను గుర్తించడం ఆందోళన కలిగిస్తున్న విషయమని డాక్టర్లు అంటున్నారు. రష్యా దక్షిణ ప్రాంతంలో డిసెంబర్ లో బర్డ్ ఫ్లూ వెలుగుచూసింది. ఓ పౌల్ట్రీ ఫామ్ లోని ఏడుగురు ఉద్యోగుల్లో ఈ ఫ్లూ జాతి జన్యు పదార్థాన్ని శాస్త్రవేత్తలు వేరు చేశారు. కొద్దిపాటి క్లినికల్ లక్షణాలు తప్ప ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని శాస్త్రవేత్తలు అంటున్నారు.
అయితే ఈ వైరస్ ఇప్పటికైతే ప్రాణాంతకం కాదని డాక్టర్లు అంటున్నారు. అయితే భవిష్యత్ లో ఈ వైరస్ రూపాంతరం చెంది మరింత ప్రమాదకరం అయ్యే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. మనదేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ప్రస్తుతం అయితే తీవ్రత తగ్గింది.