అమెరికాలో తొలి భారతీయుడి ఉరి

Update: 2018-01-11 17:45 GMT
నాలుగేళ్ల క్రితం అమెరికాలో సంచలనం సృష్టించిన బామ్మ-మనవరాలి జంట హత్యల కేసులో ముద్దాయిగా పట్టుబడిన రఘునందన్ యండమూరి కేసు ఎంత సంచలనం రేపిందో ఇంకా అందరికి గుర్తే. ఏ మాత్రం మానవత్వం లేకుండా నిర్దాక్షిణ్యంగా రెండు ప్రాణాలు బలితీసుకున్న తీరు చూసి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుంది. నిందితుడికి ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదని ముక్త కంఠంతో నినదించింది. వాళ్ళ ఆకాంక్ష ఇప్పుడు నెరవేరబోతోంది. ఫిబ్రవరి 23న రఘునందన్ కు ఉరిశిక్ష అమలు చేయబోతున్నట్టు స్థానిక అమెరికా కరెక్షనల్ ఆథారిటీస్ ప్రకటించాయి. రఘునందన్ అమెరికాలో ఉరిశిక్షకు గురైన మొట్టమొదటి భారతీయుడు. ఇంత వరకు పలువురు భారతీయులు ఏవైనా నేరాల్లో పట్టుబడినా అవేవి కూడా ఉరి తీసేంత దారుణమైనవి కాదు. కాని రఘునందన్ చేసింది క్షమించరాని నేరం కావడంతో ఉరి శిక్ష విధించడం సబబని అప్పుడు తీర్పు చెప్పిన న్యాయమూర్తి వెల్లడించారు.

ఎలెక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీర్ అయిన రఘునందన్ హెచ్ 1బి వీసా కింద అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన బంధువుల పైనే ఇంత దారుణానికి ఒడి గట్టాడు. ఉరిశిక్ష తేది ప్రకటించినప్పటికీ ఇది వాయిదా లేదా పూర్తిగా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు స్థానిక అధికారులు. పెనిన్స్లేవియా గవర్నర్ ఆధ్వర్యంలో ఉండే డెత్ పెనాల్టి మారటోరియం చెప్పిన ప్రకారం సెక్రటరీ అఫ్ కరెక్షన్స్ కు 30 రోజుల కాల వ్యవధి ఉంటుంది. ఒకవేళ గవర్నర్ కనక అమలు పరిచే వారెంట్ ను ఇష్యూ చేయకపోతే సెక్రటరీకు అది వాయిదా వేసే అధికారం ఉంటుంది. గత 18 ఏళ్ళలో పెనిన్స్లేవియా పరిధిలో ఒక్క ఉరిశిక్ష కూడా అమలు జరపబడలేదు. చివరి ఉరిశిక్ష 1999లో అమలు చేసారు. కొన్ని సాంకేతిక నిబంధనలు రఘునందన్ కు అనుకూలంగా మారితే ఇంకొంత కాలం బ్రతికే అవకాశం ఉంది. కాని అక్కడి భారతీయులు మాత్రం ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వాడిని క్షమించకూడదని అమలు పరచమని కోరుతున్నారు. మరో 40 రోజుల గడువు ఉన్నందున మరికొన్ని కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది.
Tags:    

Similar News