ఆన్‌లైన్‌లో మోస‌పోతే ఇలా చేయండి

Update: 2017-03-13 14:49 GMT
న‌గ‌దు ర‌హిత లావాదేవీలు పెర‌గ‌డం,  ఆన్‌ లైన్ షాపింగ్ వైపు ఎక్కువ మంది ఆస‌క్తి చూపిస్తున్న క్ర‌మంలో మోసాలు స‌ర్వ‌సాధార‌ణంగా మారాయి. అయితే ఇలా మోస‌పోయిన వాళ్లు ఎవ‌రికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి వారి కోసం బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివ‌ర్సిటీ ఆన్‌ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్ క‌న్జూమ‌ర్ మీడియేష‌న్ సెంట‌ర్ (ఓసీఎంసీ) పేరుతో దీనిని ఏర్పాటుచేశారు. పైల‌ట్ ప్రాజెక్ట్‌ లో భాగంగా ఈ-కామ‌ర్స్ రంగంలో జ‌రిగే మోసాల‌పై ఈ సెంట‌ర్ దృష్టిసారిస్తున్న‌ది. వివాదాల ప‌రిష్కారంలో వినియోగదారుల భాగ‌స్వామ్యాన్ని పెంచ‌డం, వినియోగ‌దారుల కోర్టుల‌పై ప‌ని భారాన్ని త‌గ్గించ‌డం - క‌న్జూమ‌ర్‌ - బిజినెస్ సంబంధాల‌ను మెరుగుప‌ర‌చాల‌న్న ఉద్దేశంతో ఈ సెంట‌ర్‌ ను ఏర్పాటుచేశారు. దీని కోసం కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ రూ.కోటి కేటాయించ‌గా.. క‌న్జూమ‌ర్ లా అండ్ ప్రాక్టీస్ ప్రొఫెస‌ర్ అశోక్ పాటిల్ దీనికి చీఫ్‌ గా ఉండ‌నున్నారు.

గ‌తేడాది డిసెంబ‌ర్‌ లో ఈ ఆన్‌ లైన్ సెంట‌ర్‌ ను ప్రారంభించారు. ఎప్పుడైనా, ఎక్క‌డైనా వివాద ప‌రిష్కారం నినాదంతో ఈ సెంట‌ర్ ప‌నిచేస్తోంది. క‌న్జూమ‌ర్ ప్రొటెక్ష‌న్ బిల్-2015లో భాగంగా ఈ మీడియేష‌న్ సెంట‌ర్ల‌ను దేశ‌వ్యాప్తంగా ఏర్పాటుచేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ ఓసీఎంసీ కోసం ప్ర‌త్యేకంగా యూజ‌ర్ ఫ్రెండ్లీ వెబ్‌ సైట్‌ ను కూడా త‌యారుచేశారు. దీనిద్వారా సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వినియోగ‌దారుల‌కు న్యాయం జ‌ర‌గ‌డంతోపాటు అటు కంపెనీల‌కు కూడా కోర్టు లిటిగేష‌న్ ఖ‌ర్చులు మిగిలిపోతున్నాయి. దేశంలోని అన్ని ఈ-కామ‌ర్స్ కంపెనీలు దీని ద్వారా వివాద ప‌రిష్కార ప్ర‌క్రియ‌లో పాల్గొనాల్సిందిగా కోరుతూ కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ ఆయా కంపెనీల‌కు ఇప్ప‌టికే లేఖ‌లు రాసింది. ఈ మూడు నెల‌ల్లో ఓసీఎంసీ వెబ్‌ సైట్‌ కు 45 వేల హిట్స్ వ‌చ్చాయి. రాబోయే కొన్ని సంవ‌త్స‌రాల్లో ఆన్‌ లైన్ షాపింగ్ మోసాల ప‌రిష్కారం ఓసీఎంసీ గొప్ప పాత్ర పోషించ‌బోతున్న‌ట్లు అశోక్ పాటిల్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News