ఫస్ట్ టయోటా వెల్‌ ఫైర్ కార్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్...!

Update: 2020-03-03 03:30 GMT
ఇండియాలో ఇటీవలే కొత్తగా ప్రారంభించిన టయోటా వెల్‌ ఫైర్ తాజాగా డెలివరీలను ప్రారంభించింది. ఈ కంపెనీ కి చెందిన మొదటి కారుని మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కి అందజేసింది. అయితే , ఈ కారు పూర్తిగా అందరికి అందుబాటులోకి రావడానికి ఇంకా మూడు నెలల సమయం పడుతుంది అని ,నెలకు 60 యూనిట్ల చొప్పున దిగుమతి చేసుకుంటారని, ఇప్పటికే 180 యూనిట్లు అమ్ముడయినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఈ ఆకర్షించే కొత్త టయోటా వెల్‌ ఫైర్ దేశంలో ఉండే అత్యంత విలాసవంతమైన కార్స్ లో ఒకటి. అలాగే, భారతదేశంలో విక్రయించబడుతున్న అతిపెద్ద ప్యాసింజర్ కారులలో కూడా ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 79 లక్షలు.

టయోటా వెల్‌ ఫైర్ ఫీచర్స్ : ఈ కొత్త టయోటా వెల్‌ ఫైర్ యొక్క ఫీచర్స్ ని గమనించినట్లయితే ..ముందు భాగంలో విస్తృత క్రోమ్ స్ట్రిప్స్‌ ను కలిగి ఉంటుంది. డ్యూయల్ ఎల్‌ ఇడి సెటప్‌, రూఫ్ మౌంటెడ్ రియర్ స్పాయిలర్, క్లియర్-లెన్స్ కాంబినేషన్ లైట్లు మరియు ర్యాపారౌండ్ రియర్ విండ్‌ షీల్డ్, డాష్‌ బోర్డ్ అంతా నలుపు రంగులో ఉంటుంది. సీట్లు నలుపు మరియు లేత గోధుమరంగు యొక్క డ్యూయల్ టోన్ థీమ్‌ లో లభించనుంది. ఇక ఈ సూపర్ లగ్జరీ కారులో వెంటిలేటెడ్ సీట్లు, సీట్ టేబుల్స్, యాంబియంట్ లైటింగ్, పర్సనల్ స్పాట్‌ లైట్లు, పవర్డ్ రియర్ డోర్స్, డబుల్ సన్‌ రూఫ్ మరియు ట్రై-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి

ఇక ఈ కారు యొక్క భద్రతా లక్షణాలను గమనిస్తే ...ఈ కారులో 7 ఎయిర్‌ బ్యాగులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ లాంప్స్ ఉన్నాయి. అలాగే ఇందులో 2.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 179 హెచ్‌పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇ-సివిటి యూనిట్‌ తో జతచేయబడి ఉంటుంది.దీనితో పాటుగా ఇందులో ఇ-ఎడబ్ల్యుడి వ్యవస్థ కూడా ఉంటుంది. దీని వల్ల కారు శుభ్రంగా ఉంటుంది. ఇకపోతే ఈ కారు అచ్చు బెంజ్ మెర్సిడెస్ వి క్లాస్ కారుని పోలి ఉంటుంది. ఈ టయోటా వెల్‌ ఫైర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ..ఈ రెండు కార్ల మధ్య పోటీ ఏర్పడవచ్చు.


Tags:    

Similar News