సేమ్ సినిమాలో చూసినట్టు భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా పెళ్లి ఆపండి అంటూ మొదటి భార్య ఎంట్రీ ఇచ్చి పెళ్లిని ఆపేసింది. దీంతో కల్యాణ మండపం కాస్త రణరంగంగా మారింది. పెళ్లి మండపంలో వేద మంత్రాలు వినిపించాల్సిన చోట.. తిట్లు.. అరుపులు, కేకలు వినిపించాయి. పరస్పరం వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ప్రవేశించారు. దీంతో కల్యాణ మండపం నుంచి పోలీస్‌స్టేషన్‌కు పంచాయతీ చేరింది. ఈ ఘటన తమిళనాడులోని వేలూరులో చోటు చేసుకుంది.
వేలూరు సమీపంలోని మేట్టు ఇడయాంబట్టి గ్రామానికి చెందిన రామచంద్రన్ (45)కు కమలితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. తొర్రపాడిలో టైలర్ దుకాణం నిర్వహిస్తూ కుటుంబ పోషణ చేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య కలహాలు మొదలయ్యాయి. విబేధాలతో వారిద్దరూ ఐదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటుండగా కరూర్‌కు చెందిన ఓ యువతి అతడికి పరిచయం అయ్యింది. ఆమె బంధువుల ఇంటికి వచ్చిన సమయంలో అక్కడే రామచంద్రన్ ఉన్నాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు.
జూన్ 3వ తేదీ బుధవారం అడుక్కంబరైర్లోని అమ్మన్ ఆలయంలో వివాహ ఏర్పాట్లు చేసుకున్నారు. పూజలు చేసుకుంటున్నారు. తాళి కడుతున్న సమయంలో మొదటి భార్య కమలి తన ఇద్దరు కుమారులతో వచ్చేసింది. పెళ్లి దుస్తుల్లో కనిపించిన రామచంద్రన్‌ను కమలి నిలదీసింది. దీంతో వధువు తరఫున వారు షాక్‌కు గురయ్యారు. దీంతో బంధువులు ఆమెతో గొడవ పడ్డారు. తీవ్ర వాగ్వాదం ఏర్పడడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వివాహాన్ని నిలిపివేశారు. అయితే ఈ పరిణామంతో రెండో పెళ్లి కుమారుడు రామచంద్రన్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని పోలీస్‌స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామచంద్రన్ కోలుకున్నాక ఈ కేసును పరిష్కరించనున్నారు.