ఐదేళ్ల బాలుడు..ఢిల్లీ నుండి బెంగుళూరు కి ఒంటరిగా విమాన ప్రయాణం!

Update: 2020-05-26 00:30 GMT
లాక్ డౌన్ నేపథ్యంలో గత రెండు నెలలుగా పూర్తిగా స్తంభించిపోయిన విమాన ప్రయాణాలు ..ఈ రోజు నుండి మళ్లీ ప్రారంభం అయ్యాయి. దీనితో లాక్ డౌన్ కారణంగా వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారు విమానాల్లో తమ స్వరాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఓ ఐదేళ్ల బుడతడు సైతం ఒంటరిగా బెంగళూరుకు చేరుకున్నాడు.ఇంత చిన్న వయసులో కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా ..విమానం ప్రయాణ చేయడం చూసిన వారందరు ఆశ్చర్యపోతున్నారు.

దీనిపై పూర్తి వివరాలు చూస్తే ..విహాన్ శర్మ అనే ఐదేళ్ల పిల్లవాడు లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా ఢిల్లీలోనే చిక్కుకుపోయాడు. నేటి నుంచి విమాన సర్వీసులు పునరుద్దరించబడటంతో అతని తల్లిదండ్రులు ఢిల్లీ, బెంగళూరు విమానానికి టికెట్ బుక్ చేశారు. ఢిల్లీలో తెలిసినవారు విమానాశ్రయానికి తీసుకొచ్చి విహాన్ ‌ను విమానం ఎక్కించారు. ముఖానికి మాస్కులు ,చేతులకు గ్లౌజులు తొడుక్కున్న విహాన్.. స్పెషల్ కేటగిరీలో ప్రయాణించాడు. అతని చేతిలో ఓ సెల్ ‌ఫోన్ కూడా ఉంది.

 బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి చేరేంతవరకు విహాన్ తల్లి అతనితో ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. విమానశ్రయంలో దిగగానే అతన్ని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లారు. విమానశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. తమ బాబు 3 నెలులగా ఢిల్లీలో చిక్కుకుపోయాడని తెలిపారు. నేటి విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో మొదటిరోజే తమ అబ్బాయిని వెనక్కి రప్పించాలనుకున్నామని.. అనుకున్నట్టుగానే సేఫ్‌గా వచ్చేశాడని చెప్పారు. ఇకపోతే , మొత్తంగా కెంపెగౌడ విమానశ్రయం నుంచి సోమవారం సుమారు 114 విమానాలు రాకపోకలు సాగించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో 60 విమానాలు బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లనుండగా.. 54 విమానాలు బయటి నుంచి బెంగళూరుకు రానున్నాయి.
Tags:    

Similar News