పాక్ ప్రధాని బర్త్ డే సందర్భంగా ఆయన్ను కలిసేందుకు పాక్ బయలదేరనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించటం తెలిసిందే. తన పాక్ ప్రయాణం గురించి ట్విట్టర్ లో ట్వీట్ చేసిన సుమారు రెండు గంటల వ్యవధిలోనే ఆయన పాక్ గడ్డ మీద అడుగుపెట్టారు. 11 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు పాక్ లో పర్యటించటం ఒక విశేషమైతే.. ఈ ప్రోగ్రామ్ ను ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకోవటం మరో విశేషంగా చెప్పాలి.
పాక్ కు వెళ్లి ప్రధాని నవాజ్ కు బర్త్ డే విషెస్ చెప్పాలన్న సంచలన నిర్ణయం తీసుకున్న వెంటనే.. ఆయనకు అదిరిపోయేలా విందు ఇవ్వాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ డిసైడ్ అయ్యారు. దీంతో.. వెనువెంటనే 35 మంది పాకశాస్త్ర నిపుణుల్ని పిలిపించారు. మిగిలిన నేతల మాదిరి మోడీ మాంసాహారి కాకపోవటంతో.. ఆయనకు ఇష్టమైన రీతిలో లంచ్ రెఢీ చేసేందుకు హుటాహుటిన వంటవాళ్లను పిలిపించి.. శాఖాహార వంటల్ని సిద్ధం చేయించినట్లు చెబుతున్నారు.
మోడీకి ఇచ్చే విందులో పెద్ద ఎత్తున మెనూ ప్లాన్ చేశారు. ఇక.. మోడీ వెంట వెళుతున్న వారి కోసం నాన్ వెజ్ ఐటెమ్స్ తయారు చేయించారు. మోడీ సర్ ప్రైజ్ విజిట్‌కు తగ్గట్లే ఆయనకు షరీఫ్ గ్రాండ్ గా లంచ్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది.