దివికేగిన శిఖరం..ఫుట్​ బాల్​ దిగ్గజం మారడోనా కన్నుమూత..!

Update: 2020-11-26 03:00 GMT
ఫుట్​బాల్​ ప్రపంచంలో రారాజు. నిత్యం వివాదాలు, విన్యాసాలతో తన ఫ్యాన్స్​ను మైమరిపించే డిగో మారడోనా (60) కన్నుమూశారు.  ప్రపంచఫుట్​బాల్​ చరిత్రలో ఓ క్రీడాకారుడు చేయనన్ని విన్యాసాలు మారడోనా చేశాడు. అందుకే ఆయనకు సొంతదేశమైన అర్జెంటీనాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.

గత కొంతకాలంగా మారడోనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే సర్జరీ చేయించుకున్నారు. అయితే బుధవారం రాత్రి ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో తుదిశ్వాస విడిచారు.

మారడోనా 1960 అక్టోబర్​ 30న అర్జెంటీనాలో జన్మించారు. 1986లో తన దేశానికి వరల్డ్​కప్​ అందించారు. ఫుట్​బాల్​ ఆల్​టైమ్​ గ్రేట్​గా పేరు తెచ్చుకున్నారు. తన కెరీర్లో లక్ష మొత్తం 694 మ్యాచులు ఆడి 354 గోల్స్​ సాధించాడు.  మారడోనాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అతడి విన్యాసాలు ఎందరినో ఆకట్టుకొనేవి. అయితే మారడోనా ఉచ్ఛదశలో ఉన్నప్పుడు ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. మాదకద్రవ్యాలు, తదితర కేసులో ఆయన వార్తల్లో నిలిచేవారు.

మారడోనా మృతితో అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవలే ఆయన తన పుట్టినరోజు జరుపుకున్నారు. 1986లో అర్జెంటీనా వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర మారడోనాదే. ఇంగ్లాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ తో మారడోనా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. గోల్ పోస్ట్ వద్ద మెరుపువేగంతో దూసుకెళ్లి, బంతిని గోల్ పోస్ట్ లోకి పంపినా, అది చేయి తగిలి గోల్ లోకి వచ్చిందని కొందరు ఆరోపించారు. ‘ఆ చెయ్యి దేవుడిది అయ్యిఉంటుందిలే’ అని ఆయన వ్యాఖ్యానించాడు.

ప్రారంభంలో మారడోనా అవకాశాలు రాక ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.  1976లో అర్జెంటీనా జూనియర్ జట్టుకు ఆడిన మారడోనా ఆ తర్వాతి ఏడాదే సీనియర్ జట్టుకు ఎంపికయ్యారు. మారడోనా 1984లో క్లాడియో విల్లాఫేన్ ను పెళ్లాడాడు. వీరికి దాల్మా నెరియా, గియానినా దినోరా అనే కుమార్తెలు ఉన్నారు. కానీ మారడోనా, విల్లాఫేన్ 2004లో విడాకులు తీసుకున్నారు. కాగా, యువ ఫుట్ బాల్ ఆటగాడు డీగో సినాగ్రా తన కుమారుడే అని అప్పట్లో మారడోనా అంగీకరించడం ఓ సంచలనమైంది.
Tags:    

Similar News