హుజూరాబాద్ గెలుపు కోసం.. కేసీఆర్ మూడు వ్యూహాలు!

Update: 2021-07-26 14:30 GMT
త్వ‌ర‌లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు గుర్రం ఎక్కేందుకు అధికార పార్టీ టీఆర్ ఎస్.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ విజ యం ద‌క్కించుకోవ‌డం.. కేసీఆర్‌కు అత్యంత కీల‌కం. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను బ‌య‌ట‌కు పంపి న త‌ర్వాత‌.. ఆయ‌న‌ను ఓడించ‌డం.. అనేది కేసీఆర్‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం. దీంతో కేసీఆర్ మూడు వ్యూహాల‌ను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కు లు.

దీనిలో భాగంగా.. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు, ద‌ళితుల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు, యువ‌తలో అసంతృప్తిని త‌గ్గించేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అదేస‌మ‌యంలో మూడు వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీజేపీ గ‌ట్టిగా దెబ్బ కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో కీల‌క నేత‌లుగా ఉన్న కౌశిక్ రెడ్డి, పెద్దిరెడ్డి, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు వంటి కీల‌క నేత‌ల‌ను బ‌య‌ట‌కు వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరం తా కారెక్క‌నున్నారు.

ఈ ప‌రిణామం.. నిజంగానే బీజేపీకి తీవ్ర‌మైన ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్‌కు కావాల్సి ంది కూడా ఇదే. నైతికంగా.. బీజేపీని దెబ్బ‌కొట్ట‌డం ద్వారా ఆయ‌న అనుకున్న‌ది సాధించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అదేస‌మ‌యంలో రెండో వ్యూహం విష‌యానికి వ‌స్తే.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డం. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన ప‌థ‌కాల‌ను ఇప్పుడు ప్ర‌వేశ పెడుతున్నారు. నిజానికి అధికారంలోకి వ‌చ్చింది 2018లో అయితే.. ద‌ళితులు, పేద‌లు, నిరుద్యోగులు.. కేసీఆర్‌కు ఇప్పుడు గుర్తుకు రావ‌డంవిశేషం.

ద‌ళిత బంధు పేరుతో రాష్ట్రంలోని అర్హులైన ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి 10 ల‌క్ష‌ల చొప్పున బ్యాంకులో జ‌మ చేయ‌నున్నారు. దీనికి సంబంధించి ల‌బ్ధి దారుల ఎంపిక ప్ర‌క్రియ జోరుగా సాగుతోంది. అయితే.. ఈ ప‌థ‌కాన్ని గ‌మ‌నిస్తున్న‌వారు.. ద‌ళిత ఓట్ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకే.. కేసీఆర్ ఈ ప‌థ‌కాన్ని తెచ్చార‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో యాద‌వులు, కురుమ‌లు, బీసీ సామాజిక వ‌ర్గాల‌కు కూడా ఇలాంటి ప‌థ‌కాలే తెచ్చి.. త‌న‌వైపు తిప్పుకొనేందుకు కేసీఆర్ స‌క‌ల ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు.

ఇక‌, మూడో వ్యూహానికి వ‌స్తే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల్చ‌డం. ఈ క్ర‌మంలోయాంటీ టీఆర్ ఎస్ ఓట్ల‌ను త‌గ్గించేలా.. కీల‌క వ్య‌క్తుల‌ను రంగంలోకి దింపాల‌నేది నిర్ణ‌యంగా ఉంది. ఈ క్ర‌మంలో త‌మ స‌ర్వీసును క్ర‌మబ‌ద్ధీక‌రించుకోవాల‌ని కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల‌కు.. ఇప్పుడు ప్ర‌భుతత్వ వ్య‌తిరేక ఓటును త‌గ్గించే టార్గెట్ పెట్టిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా వెయ్యి మంది వ‌ర‌కు.. ప్ర‌తి ఒక్క‌రూ.. 10 మంది ఓట‌ర్ల‌ను క‌లిసి.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించే చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం ద్వారా.. 10 వేల ఓట్లు ఎటూ పోకుండా జాగ్ర‌త్త ప‌డొచ్చ‌ని కేసీఆర్ భావిస్తున్నారు.

ఇదిలావుంటే.. వైశ్య సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను చీల్చేందుకు కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు ప‌డుతున్నా య‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఆర్య వైశ్య చైత‌న్య పోరాట స‌మితి.. ప్ర‌స్తుతం రోడ్డెక్కింది. ప్ర‌భుత్వం క‌నుక త‌మ డిమాండ్ల‌కు అంగీక‌రించ‌క‌పోతే.. త‌మ‌కు కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి...10 వేల కోట్లు కేటాయించ‌క‌పోతే.. హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో 500 మంది అభ్య‌ర్థులను రంగంలోకి దింపుతామ‌ని.. వైశ్య నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. అయితే.. దీనిని గ‌మ‌నిస్తున్న వారు.. ఇందంతా వ్యూహ‌మేన‌ని.. వైశ్య ఓట్ల‌ను చీల్చ‌డంలో భాగ‌మేన‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో అభ్య‌ర్థుల‌ను పెంచ‌డం ద్వారా.. పేప‌ర్ బ్యాలెట్‌కు వెళ్లే వ్యూహం ఉంద‌ని.. అంటున్నారు. ఇలా మొత్తంగా చూస్తే.. కేసీఆర్‌.. చాలా దూకుడుగా వ్యూహాల‌పై వ్యూహాలు వేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి.




Tags:    

Similar News