విదేశీయులు.. వారి చర్మాన్ని తాకొద్దు.. చైనా కీలక అధికారి 'అతి' వార్నింగ్
జాగ్రత్త మంచిదే. దాన్ని తప్పు పట్టలేం. కానీ.. కరోనా తర్వాత జాగ్రత్త స్థానే అతి జాగ్రత్త వచ్చేసింది. గతంలో ఇలాంటి తీరు చూసి నవ్విపోయేటోళ్లు. ఇప్పుడు అదో అవసరంగా మారటమేకాదు.. తెలివైనోళ్లు వ్యవహరించే తీరు అన్నట్లుగా మారింది. అయితే..
అది అంతకంతకూ పెరిగి పెద్దదై.. దారుణ పరిస్థితుల్లోకి తీసుకెళుతోంది. చైనా మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ దేశాలు తిట్టి పోస్తున్నాయి. కరోనా దరిద్రం ఒక కొలిక్కి వచ్చిందన్నంతనే మంకీపాక్స్ ప్రబలుతున్న నేపథ్యంలో పలు దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ జాగ్రత్తలు శ్రుతిమించి రాగాన పడుతున్నాయి.
తాజాగా చైనాకు చెందిన ఒక ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్య వివాదాస్పదంగా మారింది. విదేశీయులతో పాటు విదేశాల నుంచి వచ్చిన వారి స్కిన్ (చర్మాన్ని) తాకొద్దంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపాటు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు జాత్యాహంకార.. వివక్షపూరితంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచానికి కరోనా మహమ్మారిని తగిలించిన చైనాలో నేటికి కరోనా ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఆ దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి చాంగ్ క్వింగ్ సిటీకి చేరుకున్న ఒక వ్యక్తి.. కొవిడ్ తో క్వారంటైన్ లో ఉన్న వేళలోనే అతడికి మంకీపాక్స్ కూడా నిర్దారణైంది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన అంటు వ్యాధుల నిపుణుడు వు జూన్ యూ చైనీయుల్ని హెచ్చరించిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశీయులతో స్కిన్ టు స్కిన్ కాంటాక్టు పెట్టుకోవద్దని పేర్కొన్నారు. హోటళ్లు వినియోగించే వేళలోనూ టిష్యూలను ఉపయోగించాలని ఆయన సూచన చేయటం గమనార్హం.
ఇతగాడి అతి జాగ్రత్తలకు ప్రపంచ దేశాలే కాదు.. చైనీయులు సైతం తీవ్ర ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేస్తున్నారు. అతడి వ్యాఖ్యలు జాత్యాహంకారంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. విదేశీయులు వివక్ష ఎదుర్కొనే వేళలో చైనా ప్రజలు మౌనంగా ఉండకూదంటూ సోషల్ మీడియాలో పలువురు ఫైర్ కావటం గమనార్హం.
పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో జర్నీ చేసే వేళలో ఇతరుల స్కిన్ కాంటాక్టు ను తప్పించుకోలేవన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరికొందరు ఈ అధికారి అతి జాగ్రత్తల్ని ప్రస్తావిస్తూ.. ప్రపంచానికి కరోనాను బహుమతిగా అందించిన చైనా మీద.. ఇదే తీరులో యావత్ ప్రపంచం వ్యవహరించి ఉండి ఉంటే.. ఏమయ్యేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెబుతున్నారు. తను మాత్రమే ముఖ్యమనుకునే చైనాకు.. ఇలాంటి మాటలు ఎంతమాత్రం ప్రభావం చూపుతాయి చెప్పండి?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.