మాజీ క్రికెటర్ కి పక్షవాతం .. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే

Update: 2021-08-27 11:36 GMT
న్యూజీలాండ్ క్రికెట్ మాజీ ఆల్‌ రౌండర్ క్రిస్ కెయిర్న్స్ ఆరోగ్యం మరింత విషమంగా మారింది. గత కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో  బాధపడుతున్నాడు.  దీనితో డాక్టర్స్ వెంటనే ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. గత కొన్నాళ్లుగా ఆస్ట్రేలియాలోని కాన్‌ బెర్రా ఆసుపత్రిలో వెంటిలేటర్‌ పై చికిత్స కెయిర్న్స్‌కు చికిత్స అందిస్తున్నారు. ఆర్టోరిక్ డిసెక్షన్ అనే వ్యాధితో బాధపడుతున్న ఆయనకు హర్ట్ సర్జరీ తప్పనిసరి కావడంతో సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ఆసుసత్రికి తరలించి సర్జరీ ఏర్పాట్లు చేశారు.

అయితే , క్రిస్ కెయిర్న్స్‌కు సరజరీ చేస్తున్న సమయంలోనే వెన్నెముకలో స్ట్రోక్  వచ్చినట్లు వైద్యులు చెప్పారు. దీనితో ప్రస్తుతం అతడి కాళ్లకు పక్షవాతం వచ్చి చచ్చుబడిపోయాయని వైద్యులు ధృవీకరించారు. చాలా రేర్ కేసుల్లో మాత్రమే ఇలా హార్ట్ సర్జరీ చేస్తుంటే మరో ప్రాంతంలో స్ట్రోక్ వస్తుందని అన్నారు. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉన్నదని చెప్పారు. సర్జరీ ముగిసిన వెంటనే కుటుంబ సభ్యులు క్రిస్ కెయిర్న్స్‌ను తిరిగి కాన్‌బెర్రాకు తీసుకొని వచ్చారు. సర్జరీ ప్రభావం నుంచి కోలుకున్న తర్వాత ఆయనకు రీహాబిలిటేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

ఆస్ట్రేలియాలోనే మరొక ప్రముఖ ఆసుపత్రిలో కెయిర్న్స్‌కు కాళ్లకు సంబంధించిన థెరపీ ప్రారంభం కానున్నది. కెయిర్న్స్‌ కు సెయింట్ విన్సెంట్ ఆసుపత్రిలో హార్ట్ సర్జరీ చేస్తున్న సమయంలోనే వెన్నెముకలో స్ట్రోక్ వచ్చింది. దీంతో అతడి రెండు కాళ్లకు పక్షవాతం వచ్చింది అని కెయిర్న్స్ లాయర్ ఆరోన్ లాయిడ్ ఒక పత్రికా ప్రకటనలో చెప్పారు. న్యూజీలాండ్‌  జట్టు తరపున 1989 నుంచి 2006 వరకు ఆ దేశం తరపున క్రికెట్ ఆడాడు. న్యూజీలాండ్ తరపున 62 టెస్టులు, 215 వన్డేలు, 2 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 3320 పరుగులు, 218 వికెట్లు.. వన్డేల్లో 4950 పరుగులు, 201 వికెట్లు తీశాడు. న్యూజీలాండ్ క్రికెట్‌లో గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్లలో క్రిస్ కెయిర్న్స్ ఒకడు. క్రికెట్ నుండి రిటైర్ అయ్యాక బీసీసీఐ రెబల్ లీగ్ ఐసీఎల్‌ లో ఆడాడు. 
Tags:    

Similar News