మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మహ్మద్ మరోసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఇందులో వింతేమీ ఉందనుకుంటున్నారా.. ఆయన వయసు ఇప్పుడు 97 ఏళ్లు కావడం గమనార్హం. ఇప్పటికే ఆయన రెండుసార్లు మలేషియా ప్రధానమంత్రి పదవికి ఎన్నికయ్యారు. ఇప్పుడు మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకోవడంతో 97 ఏళ్ల వయసులో పోటీ చేయాలని వార్తల్లోకెక్కారు.
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో లంగ్ కావీ దీవి నుంచి పోటీ చేయనున్నట్టు మహతీర్ మహ్మద్ స్వయంగా ప్రకటించడం విశేషం. మలేసియా పార్లమెంటును ప్రస్తుతం ప్రధానిగా ఉన్న ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ రద్దు చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే తమ కూటమి తరఫున తాను ప్రధాని అభ్యర్థిగా ఉంటానో, లేదో ఇప్పుడే చెప్పలేనని మహతీర్ మహ్మద్ చెబుతున్నారు. కాగా మరో రెండు నెలల్లో మలేసియాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
ప్రధాని పదవికి పోటీలో ఉండేది, లేనిదీ అప్పుడే చెప్పలేనని 97 ఏళ్ల మహతీర్ మహ్మద్ చెప్పినప్పటికీ కూటమి ఆయనపైనే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఆయన రెండుసార్లు మలేషియా ప్రధానమంత్రిగా పనిచేసి ఉండటమే ఇందుకు కారణం.
ప్రధాన మంత్రి ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ ముందస్తు ఎన్నికల కోసం అక్టోబర్ 10న పార్లమెంటును రద్దు చేశారు, పాలక కూటమిలోని మిత్రపక్షాలతో విభేదాలతో అధికారంలో ఉన్న యునైటెడ్ మలేస్ నేషనల్ ఆర్గనైజేషన్ పార్టీ పార్లమెంటును రద్దు చేయాలని నిర్ణయించింది. కాగా మలేషియాలో పార్లమెంటు రద్దయిన 60 రోజులలోపు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది.
మహతీర్ 2003లో పదవీ విరమణ చేసే వరకు 22 ఏళ్ల పాటు యునైటెడ్ మలేస్ నేషనల్ ఆర్గనైజేషన్ పార్టీ ప్రీమియర్‌గా ఉన్నారు. ఆ తర్వాత, 2018లో మరోమారు ప్రధాని అయ్యారు. తద్వారా 93 సంవత్సరాల వయస్సులో ప్రధానిగా ఉన్న ఏకైక వ్యక్తిగా ప్రపంచ రికార్డు సృష్టించారు. అయితే ఫిరాయింపులతో ఆయన ప్రభుత్వం 2020లో కూలిపోయింది.
తర్వాత, మహతీర్ పెజువాంగ్ పార్టీని, అనేక చిన్న పార్టీలతో కొత్త కూటమిని స్థాపించారు. కాగా 2018లో మహతీర్‌కు మద్దతిచ్చిన మలయ్ జాతి ఓటర్లు ఈసారి మహతీర్ కు పూర్తి మద్దతు ఇవ్వకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
మలేషియాలోని 33 మిలియన్ల జనాభాలో మూడింట రెండొంతుల మంది ఉన్న మలేయ్‌ల ఓట్ల కోసం మహతీర్ తన ప్రత్యర్థి పార్టీలతో పోటీ పడుతున్నారు. మలేషియాలో చైనీయులపాటు భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరు కూడా ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.