క‌విత ఇంటి ముందే ఆమె పీఏను కొట్టేశారా?

Update: 2019-05-27 08:16 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె.. మాజీ ఎంపీ క‌వితకు సంబంధించిన ఒక సంచ‌ల‌న అంశం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇందులో నిజం ఎంత‌? అన్న‌ది తేలాల్సి ఉంది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో నిజామాబాద్ బ‌రిలో నిలిచిన క‌విత‌.. అక్క‌డ ఓట‌మి పాలు కావ‌టం సంచ‌ల‌నంగా మారింది.

అయితే.. క‌విత‌క్క ఓట‌మికి ఆమె కంటే కూడా ఆమె పీఏనే కార‌ణ‌మ‌ని.. త‌ప్పుడు స‌మాచారం ఇవ్వ‌టం.. ఆమె కోసం ప‌ని చేసే వారిని ఆమె వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా అడ్డుకోవ‌టం లాంటివి చేసేవాడ‌ని.. అందుకే అత‌డికి బుద్ధి చెప్పేందుకు వీలుగా తాజాగా క‌విత ఇంటి ఎదుటే అత‌డ్ని చిత‌క్కొట్టేసిన‌ట్లుగా ఒక వార్త వైర‌ల్ అవుతోంది. దీనికి సంబంధించి క‌విత క్యాంప్ నుంచి ఎలాంటి స‌మాచారం లేదు. ఇంత‌కూ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న పోస్ట్ య‌థాత‌ధంగా చూస్తే..

కవిత పిఎ  పై దాడి ?

నిజామాబాద్ మాజీ ఎంపి కవిత పి  ఎ శరత్ పై  ఆమె ఇంటికి వచ్చిన అభిమానుల్లో ఒకరు దాడి చేసిన సంఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది  - శనివారం ఉదయం మాదాపూర్ లోని కవిత ను కలవడానికి ఆమె అభిమానులు వచ్చారు - అక్కడే ఉన్న కవిత పి ఎ శరత్  ను చూడగానే కోపోద్రిక్తులైన అభిమానులు వాదనకు దిగారట - బండ బూతులు తిడుతూ మీ ప్రవర్తనతో మా అక్క ఓటమికి కారకులైనారు కదరా అంటూ ఓ అభిమాని పిడిగుద్దులు గుద్దారట  - తీవ్రంగా చితకబాదేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న వారు వారించారట - కవిత ఇంటి ముందే జరిగిన ఈ సంఘటన కవిత దృష్టికి వెల్లడం తో కోపం తో ఊగిపోతున్న తన అభిమానులను లోపలికి పిలిచి కూర్చోబెట్టి సముదాయించారట - బయటికి వచ్చిన అభిమానులు నవీనా చారీ కోసం ఎదురు చూశారట - మా అక్క నవీనా చారీ ని ఎక్కువ నమ్మిందని వాడు అంతా తప్పుడు సమాచారం ఇస్తూ - ఎన్ ఆర్ ఐ ల దగ్గర ఐ ఫోన్ లు - ఎలక్ట్రానిక్ - విలువైన వస్తువులకు ఆశపడి నిజమైన కార్యకర్తలను అక్క కు దూరం చేశాడని - వాడి పిచ్చి చేస్టలు ల వల్ల కష్టకాలం లో అక్కతో ఉన్న వారు ఎం పి అయ్యక  అక్కను విడిచి వెళ్ళారని - వాడు ఇక్కడికి వస్తే తన్నిపోదామని చాలా  సేపు ఎదురు చూశారట - అతడు నివాసముండే బోయిన్ పల్లి కి వెల్లి తందామని అనుకున్నారట కాని అక్క ఇంటి ముందే వాడిని తన్నాలని చాలాసేపు చూసి - ఆకలి కావడం తో వెళ్ళిపోయారట - అనంతరం శరత్ వాడుతున్న సిమ్‌ ను తీసుకొని ఇంకోసారి ఇటు రావద్దని కవిత సిబ్బంది శరత్ ను ఇంటి నుంచి పంపించారట‌.

   

Tags:    

Similar News