రాజ‌ప్ప రాజ‌కీయం.. గ‌డ‌బిడ‌ప్పా.. రీజ‌నేంటి..!

Update: 2022-10-04 23:30 GMT
రాష్ట్రం హోం శాఖ మాజీ మంత్రి చిన్న‌రాజ‌ప్ప రాజ‌కీయం గ‌డ‌బిడ‌గా మారింద‌నే టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రిజిల్లా పెద్దాపురంనియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి మ‌రీ.. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని సాధించి.. విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. తూర్పులో ఇప్పుడు టీడీపీకి నేత‌ల కొర‌త ఏర్ప‌డింది. ముఖ్యంగా.. గెలుపు గుర్రం ఎక్కుతారు.. అనే నాయ‌కుల కోసం.. చంద్ర‌బాబు ఎదురుచూస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా కాకినాడ పార్ల‌మెంటు స్థానం, రాజ‌మండ్రి పార్ల‌మెంటు స్థానాలు నాయ‌కులు లేక బోసిపో తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఆయా స్థానాల నుంచి పోటీ చేసిన వారు పార్టీకి దూరంగా ఉంటున్నారు.

దీంతో ఇప్పుడు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కీల‌కమైన నాయ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌నేది చంద్ర‌బాబు వ్యూహంగా ఉంది. అయితే.. స‌రైన నాయ‌కుడు క‌నిపించ‌డం లేద‌ని.. పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో చిన్న‌రాజ‌ప్ప‌ను కాకినాడ పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేయించాల‌ని..చంద్ర‌బాబు యోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ విష‌యం చిన్న‌రాజ‌ప్ప వ‌రకు వెళ్లింది. అయితే.. తాను పార్ల‌మెంటు స్థాయిలో పోటీ ప‌డ‌లేన‌ని.. పెద్దాపురం నుంచే మ‌ళ్లీ రంగంలోకి దిగుతాన‌ని.. త‌న అనుచ‌రుల‌కు చెబుతున్నార‌ట‌.

కానీ, చంద్ర‌బాబు మాత్రం చిన్న‌రాజ‌ప్ప‌కు కాకినాడ ఇవ్వాల‌నే భావిస్తున్న‌ట్టు సీనియ‌ర్లు కూడా.. వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అంత సొమ్ము పెట్టి తాను పోటీ చేయ‌లేన‌ని.. చేసినా.. గెలుస్తాన‌నేన‌మ్మ‌కం లేద‌ని.. సో.. పెద్దాపుర‌మైనా.. లేదా మ‌రో అసెంబ్లీ స్థానం నుంచి అయినా.. పోటీకి అవ‌కాశం ఇవ్వాల‌ని.. ఆయ‌న త‌న మ‌న‌సులో మాట‌ను చెబుతున్నారు.

ఇక‌, ఈ విష‌యం వెలుగు చూసిన ద‌గ్గ‌ర నుంచి రాజ‌ప్ప యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌ని అంటున్నారు. గ‌తంలో హుజారుగా ఉన్న ఆయ‌న‌.. ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల్లోనూ యాక్టివ్‌గా క‌నిపించ‌లేదు. అంతేకాదు.. నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప‌ర్య‌ట‌న‌లు త‌గ్గించార‌ట‌. త‌నకు ఎక్క‌డ సీటు ఇస్తారో తెలియ‌క ఆయ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ట‌. మ‌రి ఈ గ‌డ‌బిడ ఎన్నాళ్లు ఉంటుందో.. చూడాలి. చివ‌ర‌కు చంద్ర‌బాబు ఆయ‌న‌ను ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News