తల్లీతో రొమాన్స్​.. కూతురిపై గ్యాంగ్​ రేప్​.. తమిళ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు వెలుగులోకి

Update: 2020-09-25 04:00 GMT
ఆయన ఒకప్పటి ప్రజాప్రతినిధి.. ప్రజాసేవచేసి చేసి బోర్ ​కొట్టిందేమో జల్సాలకు అలవాటు పడ్డాడు. ఓ పెళ్లైన మహిళను ట్రాప్​చేసి ఆమెతో రొమాన్స్​చేశాడు. ఇది చాలదన్నట్టు ఆమె కూతురుపైనా మనసుపడ్డాడు. తన స్నేహితులతో కలిసి ప్రియురాలి 15 ఏళ్ల కూతురుపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. ఏకంగా ప్రియురాలి కూతురును ఓ గెస్ట్​హౌస్​లో బంధించి సంవత్సరంపాటు చెరబట్టి రేప్​చేశాడు. బాలిక ఎలాగోలా తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో ఈ మాజీ ఎమ్మెల్యే భాగోతం బయటపడింది.

మాజీ ఎమ్మెల్యే(60). తన నియోజవర్గానికి చెందిన సుచిత్రను (పేరుమార్చాం) ట్రాప్​చేశాడు. ఆమెకు అప్పటికే పెళ్లైంది.. కానీ భర్తతో దూరంగా ఉంటున్నది. ఈ క్రమంలో సుచిత్రతో కలిసి మాజీ ఎమ్మెల్యే నెలలపాటు రిసార్టులు, ఫామ్​హౌస్​లో గడిపేవాడు. లక్షలరూపాయలు ఖర్చుపెడుతూ.. విమానాల్లో ప్రయాణిస్తూ ఇద్దరూ ఎంజాయ్​ చేసేవారు. అయితే ఈ క్రమంలో సుచిత్ర తన కూతురును వెంట తీసుకొచ్చేది. ఓ సారి తాగిన మైకంలో కూతురును చూసిన మాజీ ఎమ్మెల్యే బాలికపై లైంగికదాడి చేశాడు. దీనికి తల్లి కూడా అడ్డుచెప్పలేదు. అయితే ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే తల్లిని వదిలేసి కూతురుమీద పడ్డాడు. కూతురును తనఫామ్​హౌస్​కు తీసుకెళ్లాడు. అక్కడ మాజీ ఎమ్మెల్యేతోపాటు అతడి స్నేహితులు కూడా ఆ బాలికపై లైంగకదాడి చేసేవారు.

ఇలాగే సంవత్సరం గడిచిపోయింది. ఈ లోపు ఆ బాలికకు ఫామ్​హౌస్​ సమీపంలోని ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ యువకుడితో కలిసి ఫామ్​హౌస్​ నుంచి పారిపోయింది. అయితే తల్లి మాత్రం ఈ మాజీ ఎమ్మెల్యే కలిసి తన కూతురును ఓ యువకుడు కిడ్నాప్​ చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గాలించగా.. సదరు బాలిక.. ఆ యువకుడితో పోలీసులకు పట్టుబడింది. అయితే బాలిక పోలీసులకు విషయం మొత్తం చెప్పింది. పోలీసులు తొలుత కేసుపెట్టేందుకు వెనకాడినప్పటికీ.. చివరకు మీడియా, ప్రజాసంఘాల ఒత్తిడితో కేసుపెట్టారు. ప్రస్తుతం ఆ మాజీ ఎమ్మెల్యేలను సొంత పార్టీ సస్పెండ్​ చేసింది.అయితే సదరు మహిళను, మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tags:    

Similar News