సోమేష్ కుమార్ కు ఎంతటి పరిస్తితి వచ్చే

Update: 2023-01-12 08:30 GMT
తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

విజయవాడలో దిగిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఓపీటీ సూచనల మేరకు ప్రభుత్వానికి నివేదించేందుకు ఏపీకి వచ్చాను. అధికారిగా నేను డిఓపిటి ఆదేశాలను పాటిస్తున్నాను. చిన్నదైనా పెద్దదైనా ప్రభుత్వం ఏం చేయమంటే అది చేస్తాను. నాకు ఏ పదవి వచ్చినా అంగీకరిస్తాను.' అంటూ సోమేష్ కుమార్ చెప్పుకొచ్చాడు.

తెలంగాణ కేడర్‌లో కొనసాగాలన్న హైదరాబాద్‌ బెంచ్‌, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలను తెలంగాణ హైకోర్టు మంగళవారం కొట్టివేసి, ఏపీ కేడర్‌లో చేరాలని ఆదేశించడంతో సోమేశ్‌కుమార్‌ ఏపీకి బదిలీ అయ్యారు.

ఈ విషయంపై అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డ్యూటీలో చేరడానికి సోమేష్ కుమార్ వచ్చారు. కేటాయింపులో జోక్యం చేసుకోవడంలో క్యాట్ తీవ్రంగా తప్పు చేసిందని భావించడంలో మాకు ఎలాంటి సందేహం లేదు. పర్యవసానంగా, క్యాట్ ఆమోదించిన మార్చి 29, 2016 నాటి తీర్పు ,ఉత్తర్వు, చట్టం మరియు వాస్తవాల విషయంలో స్పష్టంగా నిలకడలేనిది కాబట్టి,  సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తూ డీవోపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది.

తీర్పును అమలు చేసేందుకు మూడు వారాల పాటు అవకాశం ఇవ్వాలని సోమష్ కుమార్‌ న్యాయవాదుల అభ్యర్థనను హైకోర్టు అంగీకరించలేదు. సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ అందిన తర్వాత ఏపీ కేడర్‌కు వెళ్లాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈరోజు ఏపీకి వచ్చారు. ఏపీ సీఎస్ ను కలిశారు.

సీఎస్ తో కలిసి సీఎం జగన్ ను కలిశారు. సీఎం జగన్ ఏదైనా మంచి పోస్టింగ్ ఇస్తే కొనసాగే ఆలోచనలో సోమేష్ ఉన్నారు. అప్రధాన్య పోస్ట్ ఇస్తే మాత్రం ఇక వీఆర్ఎస్ తీసుకోనున్నారు. జగన్ ను కలిసిన తర్వాత తన నిర్ణయం చెబుతానని సోమేష్ అన్నాడు. దీన్ని బట్టి జగన్ చేతిలోనే సోమేష్ భవితవ్యం ఆధారపడి ఉంది.ఇన్నాళ్లు కింగ్ మేకర్ లా ఉన్న సోమేష్ ఇప్పుడు ఈ పరిస్థితికి దిగజారారని అందరూ అయ్యో పాపం అంటున్నారు.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News