కరోనాతో మాజీ కేంద్రమంత్రి నేత దిలీప్ గాంధీ మృతి

Update: 2021-03-17 06:06 GMT
కరోనా మహమ్మారి జోరు దేశంలో ఏ మాత్రం తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు కరోనా మహమ్మారి జోరు తగ్గినట్టు అనిపించినా కూడా ఆ తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఇదిలా ఉంటే .. ఈ కరోనా మహమ్మారి భారిన పడి ఎంతోమంది ప్రముఖులు , రాజకీయ నాయకులు సామాన్యులు మృతి చెందారు. పలువురు ఎమ్మెల్యేలు , ఎంపీలు , మంత్రులు , కేంద్రమంత్రులు , దేశాధ్యక్షులు కూడా ప్రాణాలొదిలారు.

ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు  దిలీప్ ‌గాంధీ  కరోనాతో బాధ పడుతూ బుధవారం కన్నుమూశారు. మంగళవారం  కరోనా  పాజిటివ్‌ నిర్ధారణ ఆయన ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస తీసుకున్నారు. అహ్మద్‌నగర్ దక్షిణ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన దిలీప్ గాంధీ  దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. మొదటిసారి 1999లో  ఆ తరువాత  2009,  2014లో మూడుసార్లు ఎంపీగా  ఎన్నికయ్యారు. 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  దిలీప్ గాంధీ 2 లక్షల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.  2009 లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచారు. దిలీప్ ‌గాంధీ మరణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ట్విటర్‌ ద్వారా  విచారం వ్యక్తం  చేశారు. దిలీప్ గాంధీ మృతికి మాజీ మంత్రి సురేష్ ప్రభు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు.  
Tags:    

Similar News