చైనాను భయపెడుతున్న నాలుగు కరోనా వేరియంట్లు..!

Update: 2022-12-28 07:30 GMT
చైనాలో నాలుగేళ్ల క్రితం నాటి పరిస్థితులు మళ్లీ తలెత్తుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచ దేశాలను కోవిడ్ ను ఎలా ఎదుర్కోవాలో చైనా చూపించింది. అయితే నేడు అదే చైనా కరోనా కొత్త వేరియంట్ల ధాటికి అతలాకుతలమవుతోంది. చైనాలోని ప్రస్తుత పరిస్థితికి అక్కడి పాలకులే కారణమనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.  

చైనా కరోనా వ్యాక్సిన్ విషయంలో చూపిన ఆశ్రద్ధ నేడు ఆ దేశంలో కోవిడ్ విలయ తాండవానికి కారణమవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ప్రభావం కలిగిన వ్యాక్సిన్లను ప్రభుత్వం అక్కడి ప్రజలు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా కొత్త వేరియంట్లు చైనాలో విజృంభిస్తున్న వేళ జీరో కోవిడ్ విధానాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది.

ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కోట్లాది ప్రజలు కరోనా బారినపడుతున్నారు. రాబోయే నాలుగు నెలల్లో కోవిడ్ కారణంగా చైనాలో 10 లక్షల మంది చనిపోతారని అమెరికా ఒక నివేదికలో వెల్లడించింది. కాగా చైనాలో వెలుగు చూస్తున్న కరోనా కేసులపై భారత ప్రభుత్వ కోవిడ్ ప్యానల్ ఛీప్ ఎన్ కే అరోడా కీలక వ్యాఖ్యలు చేశారు.చైనాలో పరిస్థితి చూసి భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

చైనా నుంచి సరైన సమాచారం లేకపోవడం వల్లే ముందస్తు జాగ్రత్త చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు. చైనాలో పెరుగుతున్న కరోనా కేసులకు నాలుగు వేరియంట్లు కారణమని అరోడా వెల్లడించారు.

చైనాలో బీఎఫ్ 7 వేరియంట్ కేసులు కేవలం 15 శాతమే నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. బీఎన్.. బీక్యూ వేరియంట్ల నుంచి 50 శాతం కేసులు వస్తున్నాయని.. ఎస్వీవీ వేరియంట్ నుంచి మరో 15 శాతం కేసులు నమోదవుతుండటంతో రోగుల్లో భిన్నమైన లక్షణాలు కన్పిస్తున్నాయని తెలిపారు.

చైనాలో పొలిస్తే భారత్ లో 97 శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకాలను వేయించుకున్నారని తెలిపారు. మిగలిన వారంతా ఒక్కసారైన కోవిడ్ బారిన పడి కోలుకున్నారని వివరించారు.12 ఏళ్ళలోపు చిన్నారుల్లో 96శాతం మంది ఒక్కసారైన కరోనా బారిన పడి కోలుకున్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ చేస్తున్న సమయంలోనే అనేకమంది కోవిడ్ సోకిందని తెలిపారు.

వాటి నుంచి ప్రజలంతా సురక్షితంగా బయటికి వచ్చినట్లు వివరించారు. భారత ప్రజల్లో హైబ్రీడ్ ఇమ్యూనిటీ కారణంగా కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ముందు జాగ్రత్తలో భాగంగా ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News