ఏపీలో షరా మామూలే అన్నట్టుగా వ్యవహారం సాగిపోయింది. అయినోళ్లకే.. అన్ని వ్యవహారాల్లోనూ.. పాజిటివ్ అడుగులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బార్ల కేటాయింపు కూడా.. అయినోళ్లకే అనుకూలంగా మారిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా నూతన బార్ పాలసీ ప్రకారం.. మూడేళ్ల పాటు బార్లు నిర్వహించేందుకు వీలుగా.. ప్రభుత్వం గేట్లు ఎత్తేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నుంచి బార్లకు ఈ వేలం నిర్వహిస్తున్నారు.
ఆదివారం కూడా ఈ బార్ల ఈ వేలం ప్రక్రియ సాగింది. అయితే.. వైసీపీ ఎమ్మెల్యేలు తమను బెదిరించా రని.. వ్యాపారులు గగ్గోలు పెట్టడం గమనార్హం. ప్రధాన నగరాల్లో వైసీపీ నేతల అనుచరులే బార్లను దక్కిం చుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇక, మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు ఆదాయం తగ్గింది. బార్ల ఈ-వేలంలో మెజారిటీ ప్రాంతాల్లో రాజీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మద్యం వ్యాపారులు సిండికేట్‌లుగా మారారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ-వేలంలో ధర పెరగకుండా వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకున్నారని.. తెలుస్తోంది. కోస్తాలోని 6 జిల్లాల్లో 500 బార్లకు ఈ-వేలం వేశారు. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, కాకినాడ, అమలాపురంలో అంతా కాంప్రమైజ్ అయినట్లు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లా దర్శిలో మద్యం షాపు రూ.1.47 కోట్లు పలికింది. ఇదే జిల్లాలోని అద్దంకిలో రూ.1.37 కోట్లకు పాడారు. మార్కాపురంలో రూ.1.17 కోట్లు, చీమకుర్తిలో రూ.1.7 కోట్లకు వేలం పాడారు. ప్రధాన నగరాల్లో వైసీపీ నేతల అనుచరులకే ఈ టెండర్లు అనుకూలంగా ఉన్నాయనే విమర్శలు రావడం గమనార్హం.
కాకినాడ కార్పొరేషన్ పరిధిలో 11 బార్లకు వేలం వేశారు. ఈ-వేలానికి కేవలం 11 మంది హాజరయ్యారు. ప్రభుత్వ ధరకు కేవలం 2 లక్షలే అదనంగా వ్యాపారులు వేలం పాడారు. ముందే పోటీ నుంచి ఏడుగురిని వైసీపీ కీలక నేత ఒకరు తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ జిల్లాలో బార్ల ఈ-వేలం ప్రక్రియ ముగిసింది. తిరువూరు మినహా అన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్ గా మారారు. తిరువూరులో అత్యధికంగా రూ.59 లక్షలు షాపును దక్కించుకున్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 110 బార్లకు గానూ 109 బార్లకు వేలం వేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో.. ప్రభుత్వం రూ.50 లక్షలు నిర్ణయించగా.. రూ.54 లక్షలకు వ్యాపారులు పాడారు.