దేశంలో కరోనా జోరు ఏ మాత్రం తగ్గడంలేదు సరికదా , రోజురోజుకి మరింతగా పెరిగిపోతుంది. ముఖ్యంగా దేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మరణ మృదంగం వాయిస్తుంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు మహారాష్ట్ర లో వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 58, 993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 32,88,540 కు చేరుకున్నాయి. నిన్న 301 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 57,329 కు చేరుకుంది. కాగా ఇప్పటి వరకు అత్యధిక మరణాలు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే మినీ లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం సెక్షన్ 144, నైట్ కర్ఫ్యూతోపాటు వీకెండ్ లో అంటే వచ్చే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు వరకు సంపూర్ణ లాక్ డౌన్ ను విధించింది.తాజాగా కరోనాను అదుపుచేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్ లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మినీ లాక్ డౌన్ లో భాగంగా ఇప్పటికే హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ధార్మిక, దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్‌లు, సెలూన్లు మూసి వేసిన సంగతి తెలిసిందే. పూణే, ముంబై, నాగ్‌పూర్, థానే, ఔరంగాబాద్‌లలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరణాల రేటు 1.79 శాతంగా ఉంది. కరోనా టీకాల కొరతతో ఇప్పటికే పలు వ్యాక్సిన్ కేంద్రాలు మూతపడుతుండగా.. మరికొన్ని చోట్ల ఆస్పత్రుల్లో పడకల కొరతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత కొన్ని వారాలుగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో జనం తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొవిడ్ విజృంభణ రోజురోజుకీ పెరిగిపోతున్న వేళ ప్రభుత్వంలోని మంత్రుల నుంచే పూర్తి స్థాయి లాక్ డౌన్ పెట్టాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకొని కరోనా కట్టడే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని తాను ప్రతిపాదించినట్టు మహారాష్ట్ర మంత్రి విజయ్ వడెట్టివార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పూర్తి లాక్‌డౌన్ పెట్టే అంశంపై రేపు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.