రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచమే తలకిందులవుతోంది. రష్యా తన వైఖరి మార్చుకోవడం లేదు. యుద్ధమే శరణ్యమనే వాదనలో ఉంది. దీంతో అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లను సైతం లెక్కచేయడం లేదు. ఫలితంగా ఇతర దేశాలు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పుడు ఉక్రెయిన్ సాయం చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. దానికి అనుగుణంగానే రష్యా చర్యలను ఖండించాలనే వాదనలు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అలీన విధానం ప్రకారం నడుచుకునేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిని అమెరికా తప్పుబడుతోంది. రష్యాతో ఉన్న మైత్రిని సాకుగా చూపి ఇండియాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. రష్యా విధానాలను ఖండించాలని చెబుతోంది. దీనికి భారత్ మాత్రం ససేమిరా అంటోంది. రష్యాతో ఉన్న బంధాన్ని తెంచుకోలేకపోతోంది. దీంతో అమెరికా తన స్వరం పెంచుతూ చైనా భారత్ పై దాడి చేస్తే రష్యా రక్షిస్తుందా? అని ప్రశ్నులు సైతం వేసింది. కానీ ఇండియా మాత్రం ఏ బెదిరింపులకు లొంగడం లేదు.
ఫలితంగా ఉక్రెయిన్ కు సాయం చేయడం లేదనే ఉద్దేశంతో అమెరికా ఇండియాపై అవాకులు చెవాకులు పేలుతోంది. రష్యాను కట్టడి చేసేందుకు ఇండియా ఎందుకు ముందుకు రావడం లేదని బుకాయిస్తోంది. దీనిపై అంతర్జాతీయంగా ఇండియాను ఏకాకిని చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం జరిగే జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి జర్మనీ ఇండియాను ఆహ్కానించలేదనే వార్త ఒకటి ప్రచారం సాగుతోంది.
రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి కారణంగానే జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి ఇండియాకు పిలుపు రాలేదనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సారి జీ7 శిఖరాగ్ర సమావేశం జర్మనీలో జరగనుంది. అందుకే భారత్ కు ఆహ్వానం అందలేదని చెబుతూ జాతీయ మీడియా పలు వార్తలు ప్రసారం చేసింది. దీంతో వాటిని తోసిపుచ్చిన జర్మనీ బుధవారం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. తాము భారత్ కు ఆహ్వానం పంపినట్లు తెలిపింది. దీంతో అన్ని పుకార్లకు ఫుల్ె స్టాప్ పెట్టినట్లు అయింది.
యుద్ధం వద్దని వారిస్తూ మానవ హక్కుల మండలిలో ఓటింగ్ పెడితే దానికి భారత్ హాజరు కాలేదు. రష్యా నుంచి చమురు ఉత్పత్తులు కొనుగోలు చేస్తూ అంతర్జాతీయ సమాజం దృష్టి పడేలా చేస్తోంది. యుద్ధం జరుగుతున్న సమయంలోనే రష్యా విదేశాంగ మంత్రి భారత్ లో పర్యటించడం ఆయన పలు ఒప్పందాలపై సుముఖత వ్యక్తం చేయడంతో అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తోంది. తమకు పక్కలో బల్లెంలా మరిన రష్యాతో భారత్ అంటకాగడంపై గుర్రుగా ఉంది.
2019 నుంచి భారత్ కు శిఖరాగ్ర సమావేశాలకు ఆహ్వానాలు అందుతున్న కరోనా కారణంగా నిర్వహణ సాధ్యపడలేదు. గత సంవత్సరం లండన్ లో శిఖరాగ్ర సమావేశానికి మోడీకి ఆహ్బానమున్నా అక్కడ కరోనా రెండో దశ ఉధృతంగా ఉన్నందున వర్చువల్ సమావేశంలో మోడీ పాల్గొన్నట్లు తెలిసిందే. దీంతో జీ7 దేశాల సమావేశానికి సెనెగల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా దేశాలను జర్మనీ ఇప్పటికే ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఇండియాను కూడా పిలిచింది.
మొత్తానికి రష్యా ఉక్రెయిన్ ను టార్గెట్ చేసుకుని యుద్ధం చేస్తుండటంతో అన్ని దేశాలు ముక్తకంఠంతో వద్దని వారిస్తున్నాయి. యుద్ధంతో ఏమి సాధించలేమని చెబుుతున్నా పుతిన్ పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా హాహాకారాలే. ఎక్కడ చూసినా శవాలే. దీంతో ప్రపంచమే నివ్వెరపోతోంది. రష్యా రక్కసిని ఎండగడుతోంది. అయినా పుతిన్ మాత్రం తమ సిద్ధాంతమే సరైందని చెబుతుండటం విశేషం.