టీఆరెస్ ప్రజాప్రతినిధులు అధికారులతో అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు - ఎంపీలు - మంత్రులు తమ దురుసుతనంతో అధికారులను ఇబ్బంది పెట్టగా తాజాగా నల్లగొండ జిల్లా తుంగతుర్తి టిఆర్ ఎస్ శాసనసభ్యుడు గాదరి కిశోర్ ఓ రెవెన్యూ అధికారిపై మండిపడ్డారు.
ఇటీవల నిర్వహించిన సభలో ఎమ్మెల్యే కిశోర్ ప్రసంగిస్తున్న సమయంలో తహశీల్దార్ సెల్ కు ఫోన్ రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వేదికపైనే తహశీల్దార్ పై తిట్లదండకం అందుకున్నారు. . ఎంపిడివో కార్యాలయంలో దీపం పథకం కింద మంజూరైన సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే డబుల్ బెడ్ రూం ఇళ్లపథకం లబ్ధిదారుల ఎంపిక విషయం గురించి వివరిస్తుండగా తహశీల్దార్ దశరథ్ ఫోన్ మోగింది. అంతే... ఎమ్మెల్యే కిశోర్ ఆగ్రహంతో ఊగిపోయారు. తహశీల్దార్ వైపు కోపంగా చూస్తూ తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగిస్తుండగా తహశీల్దార్ కు రెండవసారి ఫోన్ వచ్చింది. దాంతో ఆయన వేదికపైనే ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే కిశోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తహశీల్దార్ పై తిట్ల దండకం అందుకున్నారు. ''యూజ్ లెస్ ఫెలో, రాస్కెల్.. అసలు చదువుకున్నావా, లేదా, హౌలా, అసలు నీకు తలకాయ పనిచేస్తుందా లేదా'' నోటికొచ్చినట్లుగా తిట్టేశారు. ఎమ్మె ల్యే చర్యతో వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు - అధికారులు - సభకు హాజరైన వారంతా నిశ్చేష్టులయ్యారు. పాపం ఆ తహసీల్దారు కూడా చాలా బాధపడ్డారు. ఇటీవల పలువురు ప్రజాప్రతినిధులు తమ దురుసు ప్రవర్తనతతో అధికారులను అవమానిస్తున్నారు. అంతేకాదు కొందరు చట్ట వ్యతిరేక చర్యల్లోనూ పాల్గొంటున్నారని పోలీసులు చెబుతున్నారు. నల్గొండ జిల్లాకే చెందిన ఓ ఎమ్మెల్యే కు దొంగ నోట్ల వ్యవహారంతో సంబంధం ఉందని.. ఇటీవల ఆయన అనుచరులను ఇద్దరిని ఛత్తీస్ గఢ్ పోలీసులు అరెస్టు చేశారని సమాచారం. ఆయనెవరో మరి?