పొగడ్తకు మించిన బహుమానం మరొకటి ఉండదు. ఎదుటి వ్యక్తి ఎంత పెద్దవాడైనా.. గురి చూసి కొట్టినట్లుగా చేసే పొగడ్త ఓ రేంజ్ లో పని చేయటమే కాదు.. ఆ వ్యక్తి మనసులో స్థానం సంపాదించుకునే వీలు కలుగుతుంది.తనదైన శైలిలో దూసుకెళుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగిడేందుకు గులాబీదళం సిద్దంగా ఉంది. అయితే.. ఆ అవకాశాన్ని తనకు తానుగా సృష్టించుకొని అందరి ఎదుట పొగిడేసి.. అందరి కంట్లో పడ్డారో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే.
సదరు ఎమ్మెల్యే పొగడ్త విన్న వారంతా అలాంటి ఐడియా తమకు దక్కలేదని తీవ్ర వేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆ రేంజ్ లో పొగిడేసే అవకాశం తమకు దక్కలేదన్న బాధ వారి మాటల్లో వినిపిస్తోంది. ఇంతలా వేదనకు గురి చేసిన తెలంగాణ అధికారపక్ష ఎమ్మెల్యే మరెవరో కాదు.. నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్.
బడ్జెట్ మీద చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనకు లభించిన సమయాన్ని కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తి పలువురి మనసు దోచుకున్నాడు.తాను శ్రీరామ రాజ్యం గురించి విన్నానని.. అలాంటి కాలాన్నే ఈ చంద్రుడి కాలంలో తామంతా చూస్తున్నామని పొగిడేశాడు.
పద్నాలుగేళ్ల వనవాసం తర్వాత అలనాటి శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైతే..ఈ చంద్రుడు పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమం తర్వాత ముఖ్యమంత్రి అయ్యారని అతికినట్లు లింకు పెట్టి మరీ పొగిడేశారు. చావు నోటి వరకు వెళ్లి వచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణను గాడిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నారన్న ఆయన పొగడ్లతు విన్న అధికారపక్ష నేతలంతా అసూయ చెందకుండా ఎందుకుంటారు చెప్పండి..?