ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రముఖ తెలంగాణవాది - ప్రజా గాయకుడు గద్దర్ మండిపడ్డారు. చంద్రబాబు సారథ్యంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోమనే అడుగుతున్నారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటతప్పడం సరికాదన్నారు. ఓటు బ్యాంకుగా కాపులను చూస్తున్న చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు అడిగేసరికి సంఘ విద్రోహశక్తులుగా ముద్ర వేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కాపునాడు ఆధ్వర్యంలో పలువురు నేతలు గద్దర్ ను కలిసి తమ ఉద్యమానికి సంఘీభావం తెలపాలని కోరిన సందర్భంగా గద్దర్ ఈ కామెంట్లు చేశారు.
కాపుల న్యాయపరమైన హక్కుల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకోవడం సరైంది కాదని ఈ సందర్భంగా గద్దర్ అన్నారు. ప్రభుత్వమే ఉద్యమాన్ని హింసాత్మకం చేసి అనిచివేయాలని చూస్తోందని ఆరోపించారు. కాపుల న్యాయమైన డిమాండ్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని గద్దర్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య ఆకాంక్షను ప్రతిబింబించే ఉద్యమాలకు తన మద్దతు ఉంటుందని గద్దర్ తెలిపారు. కాగా, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని మాత్రమే ముద్రగడ అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ హామీలను నెరవేర్చేందుకు ఏపీ సిఎం చంద్రబాబునాయుడు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకొని మళ్లీ గృహనిర్బంధంలో ఉంచడం ప్రభుత్వం అణిచివేత దోరణికి అద్దంపడుతోందని నారాయణ మండిపడ్డారు. ఇది నిరవధిక పాదయాత్ర అని, వాయిదా వేసే ప్రసక్తే లేదని, పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ స్పష్టం చేసినప్పటికీ ఆయన నివాసం వద్ద పోలీసులను మోహరించడం సరికాదని తెలిపారు. ఇతర పరిణామాల గురించి స్పందిస్తూ ఇసుక, ల్యాండ్ మాఫియా ముఠాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అడ్డుకోలేకపోతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.