ప్రజా యుద్ధనౌక గద్దర్ తన భవిష్యత్ కార్యాచరణకు వేగంగానే కదులుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను ప్రజాస్వామ్య పోరాట పంథాలో సాగుతానని ఇప్పటికే ప్రకటించిన గద్దర్...ఇందుకు తగిన కార్యాచరణ మొదలుపెట్టారు. భావసారుప్యత గల వ్యక్తులతో చర్చిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు చేశారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడిన గద్దర్... ``పల్లె పల్లెకు పాట - పార్లమెంట్ కు బాట " అనే నినాదంతో త్యాగాల కుటుంబాలను కలుస్తూ కొత్త పార్టీ ప్రచారం కొనసాగిస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై గద్దర్ పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణకు బహుజన సారథ్యం ఉండాలని, దొరల నాయకత్వం వద్దని పరోక్ష విమర్శలు చేశారు. బహుజన తెలంగాణ సాథన కోసం సాగే ఉద్యమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని గద్దర్ పిలుపునిచ్చారు. త్యాగాల తెలంగాణ సాధన కోసం ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ లో భువనగిరిలో పది లక్షల మంది తో భారీ బహిరంగ సభను నిర్వహినున్నట్లు గద్దర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రజా క్షేత్రంలో ప్రజల మధ్య ఉండే నేతలను ఎన్నుకొనే విధంగా బడుగు బహుజనులను చైతన్య పరిచే కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ పిలుపుతో ఏమి సాధించలేరని ఈ సందర్భంగా గద్దర్ వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/