ప్రజాయుద్ధనౌకగా పేరొందిన ప్రముఖ సామాజికవేత్త గద్దర్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి కొద్దికాలం క్రితం సూత్రప్రాయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏ పార్టీకి మద్దతివ్వనున్నారు? స‌్వతంత్య్రంగానే పోటీ చేస్తారా? రాజకీయ అజెండా ఏంటి అనే అంశాలపై గద్దర్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. పవన్ - రజనీ తో కలిసి పనిచేయాలని ఉందని గద్దర్ తెలిపారు.
సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ (సికా) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక- సామాజిక - రాజకీయ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంగా గద్దర్ మీడియాతో మాట్లాడుతూ సూపర్ స్టార్లయిన రజనీకాంత్ - పవన్ కళ్యాణ్ తో కలసి పనిచేయాలని భావిస్తున్నామని తెలిపారు. పవన్ - రజనీ మంచివాళ్ళని గద్దర్ ప్రశంసించారు తెలిపారు. తాము ప్రజలో పోరాడే వాళ్లమని, ఆ ఇద్దరికీ భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారని పేర్కొంటూ ఇద్దరం కలిస్తే ఉద్యమం ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే తన తరపున ఇప్పటికే ప్రతినిధులు పవన్ కళ్యాణ్ ని రజనీకాంత్ ని కలిశారని వెల్లడించారు. వారికి తమ విధానాలు స్పష్టం చేశామని, వారి నుంచి అంగీకారం కోసం ఎదురుచూస్తున్నామని గద్దర్ తెలిపారు.
ఈ సందర్భంగా తమ వేదిక ద్వారా 200 పార్లమెంట్ స్థానాల్లో మా సాంస్కృతిక ఉద్యమం నడపబోతున్నామని గద్దర్ ప్రకటించారు. దక్షిణాది ఆత్మగౌరవ జెండా రెపరెపలు చూడాలనే సికా ఉద్యమంలోకి పవన్ ,రజనీకాంత్‌లను ఆహ్వానించామని తెలిపారు. దక్షిణాది ప్రధాన మంత్రికి ఢిల్లీలో బొందలగడ్డకి స్థలం ఇవ్వకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. పాడేరు ఏజన్సీ లో తన మీద కరపత్రాలు వేయటం పోలీసుల పనేనని గద్దర్ ఆరోపించారు. మియాపూర్ భూముల వ్యవహారంపైనా స్పందించిన గద్దర్ కొందరు కావాలనే అక్రమాలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/