ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. మరోవైపు తన అడ్డా అయిన చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ మహా చురుకుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. ఏపీ విపక్ష నేత సొంత జిల్లా అయిన కడపలో ఏదోరకంగా పాగా వేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.తాజాగా కడప జిల్లాలో స్టీల్ ఫ్లాంట్ నిర్మించాలంటూ చేస్తున్న దీక్షల వెనుక అసలు ఉద్దేశం ఇదేనని చెబుతున్నారు.
భావోద్వేగంతో కడప జిల్లా ప్రజలకు దగ్గర కావాలని భావిస్తున్న చంద్రబాబు.. తనకు సన్నిహితుడైన సీఎం రమేశ్ ను డైరెక్ట్ గా రంగంలోకి దింపినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. స్టీల్ ఫ్యాక్టరీ కోసం బాబు కిందా మీదా పడాల్సిన అవసరం లేదని.. తనకు కానీ అవకాశం ఇస్తే.. జస్ట్ రెండేళ్లలో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని కట్టి చూపిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు గాలి జనార్దనరెడ్డి.
ఒకవేళ తాను చెప్పినట్లుగా రెండేళ్లలో కానీ తాను బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని కట్టలేని పక్షంలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చన్న సవాల్ విసురుతున్నారు. బ్రాహ్మణి స్టీల్ కోసం తాను ఇప్పటివరకూ రూ.1350 కోట్లు పెట్టుబడి పెట్టినట్లుగా చెప్పారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన గాలి.. స్టీల్ ప్లాంట్ కట్టేందుకు తాను సిద్ధమని.. తనకు కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందజేయాలని కోరారు.
ఒకవేళ కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలే స్టీల్ ఫ్యాక్టరీ కట్టేందుకు ముందుకు వస్తే తాను సహకరిస్తానన్నారు. ఒకవేళ.. వేరే వారికి స్టీల్ ఫ్యాక్టరీ కట్టేందుకు అనుమతి ఇస్తే మాత్రం తాను పెట్టిన రూ.1350 కోట్ల పెట్టుబడిని వెనక్కి ఇవ్వాలని కోరారు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యం కాదని.. మేకాన్ సంస్థ తన నివేదికలో చెబుతోందని.. ఇదే సంస్థ గతంలో బ్రాహ్మణి స్టీల్ కర్మాగార నిర్మాణం ఫీజబులిటీకి సంబంధించి పాజిటివ్ నివేదిక ఇచ్చిన వైనాన్ని గుర్తు చేయటం గమనార్హం.
తనను కానీ ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబు పిలిస్తే.. బ్రాహ్మణి ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం రిపోర్ట్ ను ఆయన ముందు పెట్టనున్నట్లు చెప్పారు. బాబును కలిసేందుకు తనకు అనుమతి ఇస్తే.. బ్రాహ్మణి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాల్ని పంచుకోవటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాకర్టీ గురించి ఇటీవల కాలంలో అదే పనిగా మాట్లాడుతున్న చంద్రబాబు.. గాలి ఆఫర్ కు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.