చంద్ర‌గిరి బ‌రిలోకి గ‌ల్లా సిస్ట‌ర్!

Update: 2018-07-17 04:27 GMT
రాజ‌కీయ ప్ర‌ముఖుల వార‌సులు.. కుటుంబ స‌భ్యులు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌టం కొత్త విష‌య‌మే కాదు. తాజాగా అలాంటిదే మ‌రొక‌టి తెర మీద‌కు రానుంది. చిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో త‌మ‌దైన ముద్ర వేసిన గ‌ల్లా ఫ్యామిలీకి చెందిన మ‌రొక‌రు ఎన్నిక‌ల బ‌రిలోకి రానున్నారా? అంటే.. అవున‌ని చెబుతున్నారు. గల్లా అరుణ‌కుమారి కుమార్తె.. గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ సోద‌రి డాక్ట‌ర్ ర‌మాదేవి గ‌ల్లా ఈసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తారని చెబుతున్నారు.

2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగిన ఆమె.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంత‌రం చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన గ‌ల్లా అరుణ కుమారి.. ఈ మ‌ధ్య‌న ఆ ప‌ద‌వికి రాజీనామా చేసి పోలిట్ బ్యూరోకు ఎంపిక‌య్యారు.

ఇదిలా ఉండ‌గా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగేందుకు అరుణ‌కుమారి ఆస‌క్తిని చూపించ‌టం లేద‌ని చెబుతున్నారు. త‌న స్థానే త‌న కుమార్తె ర‌మాదేవిని పోటీలోకి దింపాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన సంప్ర‌దింపులు ఇప్ప‌టికే పూర్తి అయిన‌ట్లు చెబుతున్నారు.

2014 ఎన్నిక‌ల్లో ఓడిన నేప‌థ్యంలో..ఆ సానుభూతి ఈ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌క ఉంటుంద‌ని.. గెలుపు గ్యారెంటీ అని భావిస్తున్నారు. వాతావ‌ర‌ణం త‌మ‌కు అనుకూలంగా ఉన్న వేళ‌లోనే త‌న రాజ‌కీయ వార‌సురాలిగా త‌న కుమ‌ర్తెను బ‌రిలోకి దింపేందుకు గ‌ల్లా అరుణ ఆస‌క్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంచ‌నా నిజ‌మైతే.. ఏపీ రాజ‌కీయాల్లోకి మ‌రో వార‌సురాలు రాజ‌కీయ తెర మీద‌కు వ‌చ్చేసిన‌ట్లే! 
Tags:    

Similar News