2014 ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ ల తరపున సినీ నటుడు - జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో పవన్ పై కొందరు టీడీపీ నేతలు బహిరంగ విమర్శలు చేయడం....సాక్ష్యాత్తూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పవన్ ఎవరో తనకు తెలీదంటూ... వ్యాఖ్యానిండం వంటి పరిణామాల గురించి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు పవన్ కూడా సెటైరికల్ గా స్పందించడంతో....సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. పవన్ పై టీడీపీ నాయకులెవరూ విమర్శలు చేయవద్దంటూ సూచించారు. దీంతో, తెలుగు తమ్ముళ్లు కొద్దిగా శాంతించారు. కొద్ది రోజుల క్రితం పవన్ ....కొందరు టీడీపీ ఎంపీలు పోలవరం ప్రాజెక్టును వదిలేసి - వ్యాపారాలు చేసుకుంటున్నారని.... నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాజాగా - ఆ వ్యాఖ్యలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా జయదేవ్ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కొంతమంది వ్యాపారం చేసి ప్రజా ప్రతినిధులవుతుంటారని - ఇంకొంతమంది ప్రజా ప్రతినిధులుగా మారిన తర్వాత వ్యాపారాలు చేస్తుంటారని జయదేవ్ అన్నారు. ఎంపీలందరం కలిసి పార్లమెంట్ లో వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశామని, ప్లకార్డులు చూపామని గుర్తు చేశారు. తమ చేతులు కట్టేసి ఉన్నాయని, వదిలేస్తే పోరాడతామని చెప్పారు. తాము ప్రజలకు అందుబాటులోనే ఉన్నామని, కొంతమంది గిట్టనివారు తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో విజ్ఞాన్ రత్తయ్య కుమారుడు తన తో పోటీ చేసే అవకాశముందని - గెలుపుకోసం కష్టపడతానని అన్నారు 2012లో చిరంజీవి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లినపుడు తిరుపతి టికెట్ కోసం ప్రయత్నించి నిరాశచెందానని - దాంతో, టీడీపీలో చేరానని తెలిపారు. మరి , గల్లా నర్మగర్భంగా పవన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు పవన్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.