ప్రజాప్రతినిధులు కాగోరే వారిలో ప్రతి ఒక్కరూ ప్రజాసేవకోసమే పరితపించి పోతూ ఉంటారని అనుకుంటే పొరబాటే. ఎదుకంటే.. నాయకుడనే ముసుగును తగిలించుకుని ... ఎవరికి వారు తమ తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం మీద విపరీతంగా దృష్టి కేంద్రీకరిస్తుంటారు.
అచ్చంగా ఇదే డైలాగు అనలేదు గానీ.. ఇంచుమించుగా ఇదే వైఖరిని అనుసరిస్తున్నారు ఒక తెలుగుదేశం ఎంపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం చాలానే ఉన్నాయి. కేంద్రంనుంచి సాధించాల్సిన వ్యవహారాలు కూడా చాలానే ఉన్నాయి. రాష్ట్రంనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు పార్లమెంటులో ఎంత ఎక్కువగా తమ సమస్యలను ప్రస్తావిస్తే అంతగా ప్రయోజనం ఉంటుందన్నది అందరికీ తెలుసు. అయితే మన ఎంపీలు మాత్రం.. తమ తమ సొంత వ్యాపారాలకు ఉండే సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరింప జేసుకోవడం కోసం పాటు పడుతున్నారు. గుంటూరు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ - తమ వ్యాపారాల ఇబ్బందుల గురించి పార్లమెంటులో ప్రస్తావించిన నేపథ్యంలో ఇలాంటి విమర్శలు వస్తున్నాయి.
మనదేశం నుంచి విదేశాలకు పళ్ల ఎగుమతి బాగానే ఉంటుంది. చిత్తూరు జిల్లానుంచి కూడా మామిడిపళ్లు - పల్ప్ ను ఎగుమతి చేస్తుంటారు. ఎంపీ జయదేవ్ కుటుంబం ఆస్తి అయిన అమరరాజా గ్రూపునకు కూడా ఇలాంటి మామిడి పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ పల్ప్ ను ఎగుమతి చేస్తున్నప్పుడు కొన్ని యూరోపియన్ దేశాలు సుంకం వేస్తున్నాయిట. పాకిస్తాన్ - దక్షిణాఫ్రికా లాంటి కొన్ని దేశాలు మాత్రం సుంకం వేయడం లేదుట. మన కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని.. యూరోపియన్ దేశాలు కూడా పన్ను వేయకుండా చట్టం చేయించాలని ఎంపీ జయదేవ్ పార్లమెంటులో కోరారు.
మనదేశంలో చట్టాలు ఎలా ఉండాలో చర్చించి నిర్ణయించడానికి ప్రజలు - ఎంపీలను ఎమ్మెల్యేలను ఎన్నుకుంటూ ఉండగా... వారు ఈ ప్రభుత్వం ద్వారా విదేశాల్లో చట్టాలను కూడా తమ వ్యాపారాలకోసం మార్పించడానికి ప్రయత్నిస్తుండడం తమాషాగా కనిపిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావొచ్చు, పోలవరానికి నిధులు కావొచ్చు, అమరావతికి నిధులు కావొచ్చు.. ఏపీలో పురోగతి కనిపించేలా.. కేంద్రం సాయం అందించడం గురించి కావొచ్చు.. తెలుగుదేశం ఎంపీలు ప్రస్తావించడానికి బోలెడు అంశాలుండగా.. అన్నింటినీ పక్కన పెట్టి.. తమ వ్యాపారానికి లాభాలు తగ్గిపోతున్నాయి... యూరోపియన్ దేశాల్లో చట్టాలను మార్పించండి. మేం దండిగా లాభాలు దండుకుంటాం అంటూ తెదేపా ఎంపీ సభను వాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.