పట్టపగలు.. నడిరోడ్డు మీద... అందరూ చూస్తున్నారు. 11 మంది వ్యక్తులు కత్తులతో ఓ వ్యక్తిని దారుణాతి దారుణంగా నరికేశారు. మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసినవారంతా భయంతో బిక్కచచ్చిపోతున్నారు. అక్కడి సీసీ కెమెరాలో రికార్డవడంతో వెలుగుచూసిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రఫీఖుద్దీన్ అనే వ్యక్తి రోడ్డుపక్కనే ఉన్న దుకాణంలో టీ తాగుతున్నాడు. అదే సమయంలో అక్కడకు కత్తులు, కర్రలతో వచ్చిన కొందరు వ్యక్తులు అతడిపై ఒక్కసారిగా దాడి చేశారు. దుకాణంలోంచి అతడిని బయటకు లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. వారి బారి నుంచి అతడు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతడి శరీరంపై 27 సార్లు కత్తితో పొడిచి చంపేశారు. అయినా కూడా అనుమానం తీరక తుపాకీతోనూ కాల్చారు.
అతడిని చంపిన తరువాత నిందితులంతా బైక్‌లపై అక్కడి నుంచి పారిపోయారు. అయితే... మృతుడు రఫీఖుద్దీన్ రౌడీషీటర్ అని తెలుస్తోంది. ఆయనపై 30 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Full View