ఆ రోజున జర్మనీలో సామూహిక రేప్ లు?

Update: 2016-01-10 04:47 GMT
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా.. ప్రాశ్చాత్య దేశంగా.. పేరొందిన జర్మనీ దేశంలో డిసెంబరు 31 రోజున భారీ ఘోరం ఒకటి జరిగిందా? 120కు పైగా జర్మనీ అమ్మాయిలు సామూహిక అత్యాచారానికి గురయ్యారా? ఐదు నుంచి 30 మంది బ్యాచ్ లుగా ఉన్న వాళ్లు అమ్మాయిల్ని పశువుల్లా తరుముతూ వారి సెల్ ఫోన్లు.. పర్సులు దొంగలించటంతో పాటు.. దొరికిన వారిని దొరికినట్లుగా రేప్ లు చేశారా? ఇంతటి దారుణానికి పాల్పడిన వారంతా విదేశీయులా? ఈ మధ్య కాలంలో జర్మనీకి వలస వచ్చిన వారే ఇంతటి దారుణానికి తెగపడ్డారా? జర్మనీకి చెందిన వివిధ నగరాల్లో డిసెంబరు 31నాడు కనిష్ఠంగా 10 మంది.. గరిష్ఠంగా 50 మంది వరకు అమ్మాయిలు మాస్ రేపుల దారుణాన్ని ఎదుర్కొన్నారా? లాంటి ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ దారుణకాండ జర్మనీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జర్మనీ లాంటి దేశంలో ఇంత దారుణం చోటు చేసుకోవటం ఏమిటన్నది సంచలనంగా మారింది. ఈ ఘోర లైంగిక హింసపై ఎవరూ పెద్దగా మాట్లాడకపోవటం.. మీడియాలో పెద్దగా కవర్ కాకపోవటంతో పాటు.. ఈ అంశానికి పెద్దగా ప్రాచుర్యం కల్పించనప్పటికీ.. ఈ వ్యవహారం రగులుకొని.. రగులుకొని తాజాగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ సైతం వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి రావటం.. ఆమె ఇలాంటిది జరిగిందని చెప్పటం షాకింగ్ గా మారింది.

సిరియా.. ఇరాక్.. ఆఫ్ఘానిస్థాన్ తదితర దేశాల నుంచి వచ్చిన దాదాపు 11 లక్షల మంది ప్రజల మనోధైర్యాన్ని దెబ్బ తీయకూడదన్న ఉద్దేశంతో ఈ ఘోరంపై పెద్దగా మాట్లాడలేదని కొందరు చెబుతుంటే.. ఇలాంటి వాదననే మీడియా వినిపించటం విశేషం. మరోవైపు.. వలస పేరుతో వేర్వేరు దేశాల నుంచి వచ్చిన వారిపై నిందలు మోపకూడదన్న ఉద్దేశ్యంతో తాము మౌనంగా ఉన్నట్లుగా పోలీసులు పేర్కొనటం షాకింగ్ గా మారింది.

ఇక..సామూహిక రేప్ లకు గురైన పలువురు బాధితుల మాటల ప్రకారం.. తమపై అత్యాచారం చేసిన వారిలో అరబ్ మాట్లాడిన వారే ఎక్కువని చెబుతున్నారు. పలువురు బాధితులు.. తమపై దారుణానికి ఒడిగట్టిన వారు విదేశీయులేనని పేర్కొనటం గమనార్హం. మరోవైపు ఈ దురాగతానికి కారణం వలస వచ్చిన వారి కంటే డ్రగ్స్ మాఫియా కారణంగా మరో వాదన వినిపిస్తోంది. ఈ వ్యవహారంపై చాన్సలర్ ఏంజెలా మార్కెల్ మాట్లాడుతూ.. ఏ దేశీయులైనా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై జర్మనీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా? అన్నది ఆందోళనకరంగా మారింది.

Tags:    

Similar News