అఖిలప్రియ సుపారీ ఇచ్చి చంపించాలని చూసింది: ఎమ్మెల్సీ

Update: 2020-05-07 16:30 GMT
జగన్ పార్టీకి చెందిన అధికార ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు చేశారు. తాజా మాజీ మంత్రి , టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ.. ఏకంగా సుపారీ ఇచ్చి సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నిందని ఆరోపించాడు. వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి.

భూమా అఖిలప్రియకు, వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబాలకు ఆది నుంచి పెద్ద వైరమే ఉంది. కర్నూలులో వీరిది తరతరాల ఫ్యాక్షన్ గొడవలున్నాయి. తాజాగా గంగుల అధికార పార్టీలో ఉన్నారు. ఈ సందర్భంగానే ఆయన అఖిలప్రియపై సంచలన ఆరోపణలు చేశారు.

ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిని చంపించడానికి టీడీపీ నేత భూమా అఖిలప్రియ రూ.50లక్షల సుపారీ ఇచ్చిందని.. ఇంత చిన్న వయసులోనే హత్యలు చేయిస్తోందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. హత్యకు సుపారీ తీసుకున్న ముగ్గురు వ్యక్తులు కడప పోలీసులకు చిక్కారని.. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే భూమా అఖిలప్రియ పారిపోయారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఆళ్లగడ్డలో ప్రజలు అఖిలప్రియను ఓడించినా ఇంకా పద్ధతి మార్చుకోలేదని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.

ఇక కరోనా టైంలో ఆహోబిలం ఆలయం తెరిచి వైసీపీ నేతలు , గంగుల పూజలు చేశారని అఖిలప్రియ ఆరోపించారు. దీనికి కౌంటర్ గా గంగుల తాజాగా అఖిలప్రియపై సంచలన ఆరోపణలతో హీట్ పెంచారు.
Tags:    

Similar News