వల్లభనేని వంశీమోహన్... టీడీపీ దివంగత నేత పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడిగానే కాకుండా పార్టీకి గుండెకాయ లాంటి కృష్ణా జిల్లాలో నమ్మినబంటు అన్నది అందరికీ తెలిసిందే. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలోనూ పక్క చూపులు చూడని నేతగా వల్లభనేనికి మంచి రికార్డే ఉంది. అంతేకాదండోయ్... కృష్ణా జిల్లాలో ప్రత్యేకించి విజయవాడలో పార్టీకి ఏ కష్టమొచ్చినా అధిష్ఠానానికి ముందుగా గుర్తుకు వచ్చేది వంశీనే. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే... ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పే తత్వమున్న వల్లభనేని... గడచిన ఎన్నికల్లో నగర శివారు ప్రాంతం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీలో పెద్దగా కనిపించని వంశీ... పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చాలా చురుగ్గా పాలుపంచుకుంటారు. వేదికను ఎక్కే కంటే కూడా వేదిక కింద ఉండే అన్నీ తానై చూసుకుంటారన్న కీలక వ్యక్తిగా మంచి పేరు సంపాదించారు.
మరి అలాంటి నేతను - యువకుడి ఉజ్వల భవిష్యత్తు ఉన్న నేతను పార్టీ అధిష్ఠానం - పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఎలా చూసుకోవాలి? కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అసలే విషయాన్ని కుండబద్దలు కొట్టే తత్వమున్న వంశీకి ఇటు రాజకీయ నాయకులతో పాటు అటు సీతారామాంజనేయులు లాంటి పోలీసు అధికారులతోనూ వైరమున్న విషయం తెలియనిదేమీ కాదు. మరి అలాంటప్పుడు వంశీకి ఎలాంటి భద్రత కల్పించాలి? అధికారంలో ఉన్నది సొంత పార్టీ అన్న భావన తప్ప... వంశీలో ఏ విషయానికి సంబంధించి ఏమాత్రం సంతృప్తి లేదనే చెప్పాలి. సంతృప్తి మాట అటుంచితే... అసలు తన పట్ల - తన విజ్ఞప్తుల పట్ల పార్టీ అధినేత - సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న ధోరణిపై ఆయన అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈ అసంతృప్తి ఎంతగా ఉందంటే... ప్రభుత్వం కేటాయించిన గన్ మన్ ను తిప్పి పంపేంతగా.
ఇక అసలు విషయంలోకి వస్తే... గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీమోహన్ కు ప్రభుత్వం వన్ ప్లస్ వన్ గన్ మన్ భద్రత కొనసాగుతోంది. అయితే వివిధ వర్గాల నుంచి తనకు ఎదరువుతున్న బెదిరింపుల నేపథ్యంలో సదరు భద్రతను టూ ప్లస్ టూకు పెంచాలని ఎప్పుడో మూడున్నరేళ్ల నాడు ఆయన చంద్రబాబు సర్కారుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన దరఖాస్తును చంద్రబాబు సర్కారు కన్నెత్తి చూసిన పాపాన పోలేదట. సరే భద్రత స్థాయిని పెంచకున్నా... తన వద్ద ఉన్న మూడు ఆయుధాల లైసెన్స్ ను అయినా రెన్యూవల్ చేయాలని కోరుతూ... వంశీ సదరు ఆయుధాలను పోలీస్ స్టేషన్ లో అప్పగించారట. ఇది జరిగి కూడా చాలా కాలమే అవుతోందట. అయితే ఈ విషయంపైనా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందట. దీంతో చిర్రెత్తుకొచ్చిన వంశీ.. నేటి ఉదయం చంద్రబాబు సర్కారుకు మైండ్ బ్లాక్ అయ్యే నిర్ణయం తీసుకున్నారు.
తనకు కేటాయించిన గన్ మన్ ను వంశీ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ సందర్భంగా వల్లభనేని ఏమన్నారంటే ...‘నా గన్ మెన్ కు కేవలం ఒక పిస్టల్ ఇచ్చారు. కనీసం కార్బన్ వెపన్ కూడా ఇవ్వలేదు. మూడున్నరేళ్ల నుంచి భద్రతను పెంచమని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. నా లైసెన్స్ డ్ ఆయుధాలు మూడింటిని రెన్యువల్ కోసం పోలీస్ స్టేషన్ లో అప్పగించా. కనీసం వాటిని కూడా తిరిగి ఇవ్వలేదు’ అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి పార్టీలో కీలక నేతగా ఉన్న వంశీకే ఈ తరహా జాప్యం జరిగితే... మరి సాధారణ కార్యకర్తల మాట ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ముందే పలు వర్గాల నుంచి ముప్పు పొంచి ఉన్న వంశీకే భద్రత కరువైతే... ఆయనకు జరగరానిది ఏదన్నా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారన్న ప్రశ్న కూడా ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. వంశీ నిరసనతోనైనా... బాబు సర్కారు ఆయన అభ్యర్థనల పట్ల దృష్టి సారిస్తుందో, లేదో చూడాలి.