తెలుగుదేశం పార్టీలోని అంతర్గత కుమ్ములాటలో మరో కోణం తెరమీదకు వచ్చింది. విశాఖ జిల్లా రాజకీయాల్లో సర్వం తానే అయి నడిపించాలని భావించిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు సొంత పార్టీలోనే చుక్కెదురు అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. అంతకుముందు ఉన్నట్లుగా చింతకాయల అయ్యన్నపాత్రుడుతో విబేధాలు షరామూమూలు అయినప్పటికీ కొద్దికాలంగా పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం లైట్ తీసుకోవడం గంటాకు మింగుడు పడటం లేదని చెప్తున్నారు. ఇటీవలి కాలంలో ఫిల్మ్ నగర్ క్లబ్, బీచ్ ఫెస్టివల్ విషయంలో గంటాకు చుక్కెదురు అవడం ఇందులో భాగమని పేర్కొంటున్నారు.
రాబోయే ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ప్రేమోత్సవం నిర్వహించడంతో పాటు ప్రఖ్యాత పాప్ గాయని షకీరాతో మ్యూజికల్ నైట్ - క్యాట్ వాక్ - వెస్ట్రన్ డాన్సులు - ఫ్యాషన్ షో - లైవ్ షోలు ఏర్పాటు చేయాలని ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనపై ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ - కాంగ్రెస్ - లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై గంటా విరుచుకుపడటం - అనంతర కాలంలో అది ప్రభుత్వానికి సెల్ఫ్ గోల్ వలే మారడంతో సీఎం చంద్రబాబు సైతం గంటా తీరును తప్పుపట్టినట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకోపోకుండా గంటా నడిపించాలనుకున్న సోలో షో కాస్త ప్లాప్ షో వలే మారినట్లు టాక్ నడుస్తోంది.
బీచ్ ఫెస్టివల్ కు ముందు జరిగిన ఫిల్మ్ నగర్ క్లబ్ విషయంలోనూ గంటా ఉత్సాహం బెడిసికొట్టింది. బుద్ధులకు పవిత్రమైన బౌద్ధారామం చెంత క్లబ్ పేరిట నిర్మాణానికి సిద్ధపడటంపై బౌద్దులు ఆక్షేపించారు. దీంతో ఈ ఎపిసోడ్ లోకి గంటా రాజకీయ ప్రత్యర్థి అయిన అయ్యన్నపాత్రుడు ఎంటరై ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడం, గంటా దూకుడు తగ్గించేందుకు బాబు నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. అంతేకాకుండా గంటా పూర్వపు నాయకుడు అయిన చిరంజీవిని సైతం ముగ్గులోకి దింపి సీఎం చంద్రబాబు బావమరిది బాలయ్య బాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటున్నారు. మొత్తంగా అంతా తానే అన్నట్లుగా సాగాలనుకున్న గంటా ఎత్తుగడలు వరుసగా వైఫల్యం అవుతున్నాయని విశాఖ వాసులు అనుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/