తెలుగుదేశం రాజకీయాల్లో వ్యూహకర్తగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు పేరుంది. ఆయన పొల్లు మాట ఒక్కటి కూడా మాట్లాడరు. ఎదుటి వారి మీద అనుచితమైన విమర్శలు చేయరు. ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా సహనంతో ఉంటారని పేరు. అదే టైమ్ లో ఆయనకు వర్తమాన రాజకీయాల మీద పట్టుతో పాటు ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉందని అంతా అంగీకరిస్తారు.
ఈ మధ్య గంటా మళ్ళీ జోరు పెంచేశారు. ఆయన జనాల్లోకి వస్తున్నారు. పార్టీ నేతలతో భేటీలు వేస్తున్నారు. సొంత సామాజికవర్గంలో కూడా చురుకుగా ఉంటున్నారు. అలాంటి గంటాతో రాయలసీమకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్సీ బీటెక్ రవి తాజాగా భేటీ కావడం విశేషంగా చూస్తున్నారు. కడప నుంచి వచ్చి మరీ ఈ మాజీ మంత్రితో చర్చలు జరపడం అంటే ఏంటి మ్యాటర్ అని రాజకీయ వర్గాలలో చర్చగా ఉంది.
బీటెక్ రవి ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాకు చెందిన నేత. అంతే కాదు, ఆయన ఏకంగా పులివెందులలో టీడీపీ నాయకుడు. జగన్ మీద ఆయన పోటీ చేసి ఓడినా కూడా ఏపీలో ఆ విధంగా పాపులర్ అయిన నేత. ఇక ఫైర్ బ్రాండ్ గా పేరు. జగన్ మీద కానీ వైఎస్సార్ ఫ్యామిలీ మీద కానీ హాట్ హాట్ గా కామెంట్స్ చేయాలీ అంటే బీటెక్ రవి ఆ జిల్లాలో ముందుంటారు అంటారు.
అలాంటి రవి ఈ మధ్య వివేకానందరెడ్డి హత్య కేసుని ప్రస్తావిస్తూ వైసీపీ పెద్దల మీద సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆయన విశాఖ వచ్చి మరీ గంటా శ్రీనివాసరావుతో భేటీ కావడం అంటే మ్యాటరేంటో మరి అన్నదే తెలుగుదేశంతో పాటు అందరిలోనూ చర్చగా ఉంది. ఇక గంటాకు, కడపకూ కూడా ఒక రిలేషన్ ఉంది. ఆయన టీడీపీ మంత్రిగా ఉన్న టైమ్ లో ఆ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా ఉండేవారు.
ఆయన ఇంచార్జి మంత్రిగా ఉన్నపుడే స్థానిక కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పూర్తి బలం ఉండి కూడా కడప జిల్లాలో ఓడిపోయింది. దాంతో పాటు కడప జిల్లాకు చెందిన టీడీపీ నాయకులుకు అందరితోనూ గంటాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే బీటెక్ రవి గంటాను కలిశారు అంటున్నారు. ఇద్దరూ వర్తమాన రాజకీయ పరిస్థితుల మీద చర్చించారు అని కూడా తెలుస్తోంది. మొత్తానికి ఈ ఇద్దరు నేతల కలయిక మాత్రం రాజకీయ వర్గాల్లో కాస్తా ఇంటెరెస్టింగ్ మ్యాటర్ గానే ఉంది అంటున్నారు.