ప‌వ‌న్ పై గంటా ఘాటు వ్యాఖ్య‌లు!

Update: 2018-07-10 09:54 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌నలో ఏపీ అధికార‌పక్షంపై ప‌వ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించి.. అవాస్త‌వాల్ని ప‌వ‌న్ ప్ర‌చారం చేశార‌ని గంటా మండిప‌డ్డారు.

ప్ర‌త్యేక హోదాపై దేశం మొత్తం తిరిగి మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తాన‌న్న ప‌వ‌న్ ప‌త్తా లేకుండా పోవ‌టాన్నిగంటా ప్ర‌శ్నించారు. తాను ప‌వ‌న్ కు పాతిక ప్ర‌శ్న‌లు సంధించాన‌ని.. కానీ వాటిలో వేటికీ ప‌వ‌న్ స‌మాధానాలు చెప్ప‌లేద‌న్నారు. రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన సాయం అవ‌స‌రాన్ని తెలియ‌జేస్తూ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ రిపోర్ట్ ఇస్తే దాని మీద ప‌వ‌న్ నోరు విప్ప‌లేద‌న్నారు.  

మీ రాజ‌కీయ పార్టీ ర‌హ‌స్య ఎజెండా ఏమిట‌ని ప్ర‌శ్నించిన గంటా.. కేంద్రంపై ప‌ల్లెత్తు మాట అనే ధైర్యం జ‌న‌సేనాధినేత‌కు లేద‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచేందుకు సాయం చేసిన విష‌యాన్ని తాను ఒప్పుకుంటాన‌న్న గంటా.. ప‌వ‌న్ లేన‌ప్పుడు కూడా టీడీపీ గెలిచింద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు.

మ‌రోవైపు ఏపీ టీడీపీ మైనార్టీ  నాయ‌కుడు..ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ ప‌వ‌న్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్‌.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణల చ‌రిత్ర ఏమిటో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్న ఆయ‌న‌.. జ‌న‌సేనాధిప‌తిని దొంగగా అభివ‌ర్ణించారు. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు ఏం చేశారో తెలుస‌న్నారు. ప్ర‌ధాని మోడీ దొంగ‌ల‌తో క‌లిసి ప‌వ‌ర్ కోసం ప్లాన్ చేస్తున్న‌ట్లు మండిప‌డ్డారు. ఒక‌రు త‌ర్వాత ఒక‌రుగా టీడీపీ త‌మ్ముళ్లు ప‌వ‌న్ పై విరుచుకుప‌డ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News