విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన రాజకీయం అలాంటిది మరి. ఎందరినో ఆయన అండగా నిలిచి ముందుకు తెచ్చారు. దాంతో వారంతా ఎక్కడ ఉన్నా గంటా మాటకు నో చెప్పరు ఇక 2019 తరువాత మారిన రాజకీయ పరిస్థితుల్లో కొంతమంది నేతలు వైసీపీలోకి వెళ్లారు. ఆనాడు వారు ముందు వెళ్ళి గంటా తరువాత వస్తారని ప్రచారం సాగింది. నిజంగా అదే జరిగేది. కానీ వైసీపీలో ఒక అగ్ర నేత దాన్ని పడనివ్వలెదని అంటారు.
మొత్తానికి గిర్రున మూడేళ్ళు తిరిగేసరికి గంటా టీడీపీలో ఫుల్ యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు తో గ్యాప్ అన్నది ఒట్టి ప్రచారం అని తేలిపోయింది. ఈ మధ్యనే బాబు గంటా ఇంటికి వెళ్ళి ఆయనతో చాలా సీరియస్ గానే పార్టీ గురించి చర్చించారు. దాంతో విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల్లో పార్టీ పటిష్టత విషయంలో గంటా సూచనలను బాబు పరిగణనలోకి తీసుకుంటారు అని తెలుస్తోంది.
ఆ విధంగా చూస్తే వైసీపీలో చేరి ఫ్యాన్ నీడన ఉక్కబోత పడుతున్న వారిని తిరిగి టీడీపీ గూటికి రప్పించేలా గంటా చూస్తారని అంటున్నారు. టీడీపీ అధినాయకత్వం అయితే ఒకసారి పార్టీ విడిచి వెళ్ళి కష్టకాలంలో నష్టం చేసిన వారిని తిరిగి తీసుకునేది లేదని ఖరాఖండీగా చెబుతోంది. కానీ మళ్ళీ ఒంటరి పోరు కనుక చేయాలంటే పొత్తులు లేకపోతే సీనియర్లు, బలమైన నాయకుల అవసరం కచ్చితంగా ఉంటుందని నమ్ముతోందిట. దాంతో మాజీ తమ్ముళ్ళ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్సెస్ ఉన్నాయని అంటున్నారు.
దాంతో విశాఖ జిల్లాలో గంటా అనుచరునిగా ఉండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు టీడీపీలోకి వస్తారని తెలుస్తోంది. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన ఆయన పట్ల చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఆయన కనుక వస్తే ఉత్తరం సీటు ఇవ్వాల్సి వస్తుంది. లేదా ఎలమంచిలిలో అయినా ఆయనకు అకామిడేట్ చేయాల్సి ఉంటుంది.
అదే విధంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ రహమాన్ కూడా తిరిగి టీడీపీలోకి వస్తారని అంటున్నారు. ఆయన కూడా గంటా బ్యాచ్ లో అతి ముఖ్య నేతగా ఉండేవారు. రెండేళ్ల క్రితం ఏదో ఆశించి వైసీపీలోకి వెళ్ళినా అక్కడ ఏమీ దక్కలేదు అన్న బాధ అయితే ఆయన అనుచరుల్లో ఉంది. ఉత్తరాంధ్రాలో మైనారిటీ నేతగా గుర్తింపు ఉన్న రహమాన్ వస్తే పార్టీకి మేలు అని ఆలోచిస్తున్నారుట.
అలాగే గాజువాకకు చెందిన మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి కూడా టీడీపీలోకి చేరుతారు అని అంటున్నారు. ఆయన విషయంలో కూడా అధినాయకత్వం ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. వీరితో పాటే మరికొందరు కీలక నాయకులు. గంటా ముఖ్య అనుచరుడిగా ఉన్న కాశీనాధ్ వంటి కీలక నేతలు వైసీపీ నుంచి జంప్ చేస్తారని చెబుతున్నారు.
అలాగే వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు పలువురు కూడా టీడీపీ వైపు చూస్తున్నారుట. ఇలా చాలా మంది నేతలు సైకిలెక్కేందుకు రెడీ అంటున్నట్లు భోగట్టా. వీరిని ఒకేసారి కాకుండా విడతల వారీగా చేర్చుకుని పార్టీ మీద పాజిటివ్ వేవ్స్ ని జనాల్లోకి పంపాలని చూస్తున్నారు. మొత్తానికి గంటా బ్యాచ్ అంతా మళ్ళీ ఒక్క చోట చేరడం ఖాయమని తెలుస్తోంది.