కోపంలోనో.. ఆవేశంలోనో.. కొందరు అధినేత నోటి నుంచి వచ్చే మాటలు యమా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చిన మాటలు కూడా ఇదే కోవకు చెందినవని చెప్పాలి. గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంలో ఆయన సభ ఏర్పాటు చేశారు.
ఇందులో మాట్లాడిన పవన్.. ప్రజారాజ్యం విలీన అంశాన్ని ప్రస్తావించారు. గడిచిన కొద్ది రోజులుగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ పై ఒంటికాలిపై విరుచుకుపడుతున్న పవన్.. మరోసారి ఆయన్ను టార్గెట్ చేశారు. 2014 ఎన్నికల్లో తన మద్దతుతో గెలిచిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో చూడండండి అంటూ చెప్పిన పవన్.. మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్న డీల్ తీసుకొచ్చింది గంటా శ్రీనివాసరావునేనని పవన్ చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ఆఫర్ తెచ్చిన గంటా.. ఇప్పుడు తన పార్టీ మీద ఏదేదో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వోకే.. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపే డీల్ తెచ్చింది గంటానే అనుకుందాం. మరి.. అంత పని చేసినందుకు కోపం ఉన్న పవన్.. 2014 ఎన్నికల్లో గంటా తరఫున ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? అప్పుడేమో చేసి.. ఇప్పుడేమో అందుకు భిన్నంగా మాట్లాడటం ఏమిటి పవన్?