తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్ లోని ఉప్పల్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉప్పల్ తెరాస అభ్యర్థి సుభాష్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్ గురువారం ప్రచారానికి రాగా.. రోడ్ షోలో పేలుడు జరిగింది. కేటీఆర్ రోడ్ షోను పురస్కరించుకుని పార్టీ నేతలు గులాబీ రంగు గ్యాస్ బెలూన్లు ఏర్పాటు చేయగా.. అవి ఒక్కసారిగా పేలిపోవడంతో రోడ్ షోకు వచ్చిన పలువురు గాయపడ్డారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ బెలూన్లు పేలడానికి కారణాలేంటో తెలియరాలేదు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.ఈ పేలుడు వల్ల కాసేపు రోడ్ షోకు అంతరాయం కలిగింది. గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత ఇదేమీ పట్టించుకోకుండా కేటీఆర్ రోడ్ షో కొనసాగింది. తమ ప్రభుత్వ విజయాల గురించి చెబుతూ.. ప్రతిపక్షాల మీద విమర్శలు గుప్పిస్తూ.. పంచులు పేల్చుతూ కేటీఆర్ ప్రసంగాలు సాగాయి.