ప్రకాష్ రాజ్ హత్యకు భారీ కుట్ర

Update: 2018-06-27 09:08 GMT
నటుడు ప్రకాష్ రాజ్ ను హత్య చేసేందుకు భారీ కుట్ర జరిగినట్టు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.  ప్రముఖ సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో సందర్భంగా సిట్ కు గౌరీ లంకేష్ ను హత్య చేసిన వారే ప్రకాష్ రాజ్ హత్యకు ప్లాన్ చేసినట్టు వెల్లడైంది. ఈ వివరాలను ప్రముఖ కన్నడ వార్త చానెల్ ప్రసారం చేసింది.

ప్రదాని నరేంద్రమోడీ,  బీజేపీని విమర్శిస్తున్నందుకే ప్రకాష్ రాజ్ ను అంతమొందించాలని ఈ గ్యాంగ్ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. ప్రకాష్ రాజ్ తో పాటు ప్రముఖ రచయిత, గిరీష్ కర్నాడ్ ను కూడా హత్య చేసేందుకు ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు. విచారణ లో భాగంగా పోలీసులకు ప్రకాష్ రాజ్ ను చంపేయాలన్న పథకం గురించి గౌరీ లంకేష్ హత్య కేసు ప్రధాన నిందితుడు పరశురామ్ వాఘ్మెర్ తెలియజేశాడు.  గౌరీలంకేష్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేక ప్రకటనలు చేయడంతో అతడిని చంపేందుకు కుట్ర పన్నినట్లు వాఘ్మెర్ తెలిపాడు.

కాగా తనను గౌరీ లంకేష్ హత్య నిందితులు తనను చంపాలని కుట్ర పన్నినట్లు విషయం తెలియడంతో ప్రకాష్ రాజ్ స్పందించాడు. ‘‘తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని’’ స్పష్టం చేశాడు. కేవలం మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయవద్దంటూ ట్వీట్ చేశారు. ప్రతి సమస్యకు చంపడమే సమాధానం కాకూడదని హితవు పలికారు. ఇలాంటి ఆలోచనలు విషపూరితమైనవిగా ఆయన పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై తన గళాన్ని నొక్కేయాలని ప్రయత్నిస్తే అది మరింత బలంగా తయారవుతుందని ప్రకాష్ రాజ్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
Tags:    

Similar News