ఒకప్పటికి క్రికెటర్.. ఇప్పుడు తూర్పు ఢిల్లీకి ఎంపీగా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ కు చెందిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. చిన్న పిల్లలైన తన ఇద్దరు కుమార్తెల కాళ్లు కడిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. పెద్దయ్యాక.. పిల్లల పెళ్లిళ్ల సందర్భంగా కాళ్లు కడిగే సంప్రదాయం తెలిసిందే. అందుకు భిన్నంగా చిన్నారులైన కుమార్తెల కాళ్లు కడుగుతున్న ఫోటోను ఆయన తాజాగా పోస్ట్ చేశారు.
దీని వెనుక అసలు కారణం వేరే ఉందట. గౌతమ్ గంభీర్ వారు ఆచరించే ఆచారం ప్రకారం.. దసరా సందర్భంగా కుమార్తెల కాళ్లు కడిగి.. వారి ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఆచారాన్ని గంభీర్ ఫాలో అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.
ఫోటో పోస్ట్ చేస్తేనే వైరల్ కాదుగా.. అందులో ఏదో ఒకటి ఆసక్తికర ఎలిమెంట్ ఉండాలి కదా? తాజా ఫోటోకు క్యాప్షన్ గా.. తాను చేసిన ఈ సర్వీస్ కు బిల్లు ఎవరు పే చేస్తారంటూ వైఫ్ నటాషాను ఉద్దేశించి సరదాగా చేసిన వ్యాఖ్య పలువురిని ఆకర్షిస్తోంది. ఇదే.. ఈ ట్వీట్ వైరల్ కావటానికి కారణంగా మారింది. గంభీర్ ట్వీట్ పై పలువురు రియాక్ట్ అవుతుున్నారు. అతగాడి తండ్రి ప్రేమను తెగ పొగిడేస్తున్నారు.