రోహిత్‌శర్మను టీమిండియా కెప్టెన్ గా చేయాలన్న వాదన రోజు రోజుకూ పెరుగుతున్నది. క్రికెట్ అభిమానులు, నెటిజన్లతో పాటు మాజీ క్రికెటర్లు కూడా రోహిత్‌శర్మను కెప్టెన్ చేయాలని చెబుతున్నారు. ఐపీఎల్ 2020లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న ఆర్సీబీ ప్లేఆఫ్స్ నుంచే నిష్క్రమించడం.. రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలవడం తెలిసిందే. అయితే ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలచుకోవడం ఇది ఐదోసారి.. మరోవైపు కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ ఇంతవరకు ట్రోఫీ గెలవలేదు. అంతేగాక గత ఐపీఎల్లో విరాట్, రోహిత్ లు పెద్దగా రాణించ లేదు. అయినప్పటికీ రోహిత్ సారథ్యంలోని జట్టుమాత్రం విజేతగా నిలిచింది. దీంతో అతడికి మద్దతు పెరుగుతున్నది. రోహిత్ ను కెప్టెన్ ని చేయకపోవడం చాలా పెద్ద తప్పని ఇప్పటికే మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పలుమార్లు బహిరంగాగనే వ్యాఖ్యానించాడు. కనీసం టీ20 ఫార్మట్లోనైనా రోహిత్ ను కెప్టెన్ చేయాలన్న వాదనను గంభీర్ తో పాటు పలువురు తమ వాదన వినిపిస్తున్నారు. ఒక జట్టుకు ఇద్దరు కెప్టెన్లు ఉంటే తప్పేంటని వాళ్లు వాదిస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లడ్ జట్లకు ఇద్దరు కెప్టెన్లు ఉన్నారంటూ ఉదహరిస్తున్నారు.
నా మాట అదే: గంభీర్
కోహ్లీ సారథ్యాన్ని ఎప్పటినుంచే వ్యతిరేకిస్తున్న గౌతమ్ గంభీర్ తాజాగా మరోసారి అదే మాట అన్నాడు. ఇటీవల స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆకాశ్ చోప్రా, పార్థివ్పటేల్తో కలిసి మాట్లాడారు. రోహిత్, కోహ్లీలకు మధ్య భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని గౌతీ పేర్కొన్నాడు. గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ప్రస్తుతానికి కోహ్లి బాగానే రాణిస్తున్నాడు. ఇప్పడు జట్టును మార్చాల్సిన అవసరం లేదని తన అభిప్రాయమని చెప్పాడు.
అయితే ఆస్ట్రేలియా టూర్ కి టీం ఇండియా ఎంపికపై కూడా గంభీర్ విమర్శలు గుప్పించాడు. టీ నటరాజన్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చహల్, కుల్‌దీప్ యాదవ్ లాంటి ఆటగాళ్ల ఎంపిక సరైంది కాదన్నాడు. టీం ఇండియా జట్టు ఎంపికకు ఐపీఎల్ ఆటతీరే ప్రామాణికమని కొందరు మాట్లాడుతున్నారు. అటువంటప్పుడు కెప్టెన్సీ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా అని పేర్కొన్నారు. అయితే కెప్టెన్సీపై ఇప్పటికే కపిల్‌దేవ్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఏ జట్టుకైనా ఒక్కరే కెప్టెన్ ఉండాలి అని చెప్పాడు.