జగన్ ఇంటి వెనుక రోడ్డు లో టీడీపీ బెంచీలు.. పగలగొట్టిన వైసీపీ నేతలు

ఈ తరహా ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

Update: 2025-01-13 04:59 GMT

ఫుట్ పాత్ మీద కూర్చోవటానికి వీలుగా ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచీలను వైసీపీ నేతలు కొందరు పగలగొట్టిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఉందన్న విషయం తెలిసిందే. ఆ ఇంటి వెనుక రోడ్డులో ఫుట్ పాత్ మీద బెంచీలను ఏర్పాటు చేశారు.

ఇక్కడే మరో పాయింట్ ఉంది. అదేమంటే.. సదరు బెంచీలు టీడీపీ (తెలుగుదేశం) పార్టీకి చెందిన పసుపు బెంచీలు. గోశాల ఎదురుగా ఉన్న మార్గంలో ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశారు.అయితే.. ఈ బెంచీలపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ నేతలు మేకా అంజిరెడ్డి.. శ్రావణ కుమార్ రెడ్డిలు వాటిని కింద పడేసినట్లుగా గుర్తించారు. అయితే.. మళ్లీ ఆ బెంచీలను తిరిగి సరిగా ఏర్పాటు చేశారు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వైసీపీ నేతలు కాసేపటికే మళ్లీ తిరిగి వచ్చి.. ఆ సిమెంట్ బెంచీలను పగలగొట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వైసీపీ నేతలు మేకా అంజిరెడ్డి.. శ్రావణకుమార్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఇంటి వెనుక రోడ్డులో బెంచీలు ఏర్పాటు చేసినా ఊరుకోరా?అని ప్రశ్నిస్తుంటే.. మరెక్కడా లేనట్లుగా.. జగన్ ఇంటి వెనుక రోడ్డులోనే టీడీపీ బెంచీలను ఎర్పాటు చేయటం.. రెచ్చగొట్టే కార్యక్రమం కాదా? అన్న కౌంటర్ వాదన వినిపిస్తోంది.

Tags:    

Similar News