రూ.10 కోసం అంత పెద్దాయన్ను కండక్టర్ అలా కొట్టడమా?
ఈ వివాదానికి సంబంధించిన ఇద్దరి వాదనల్ని విన్నప్పుడు.. అవసరానికి మించిన అత్యుత్సాహంతో వ్యవహరించిన కండక్టర్ తీరు తప్పు పట్టేలా ఉండటమే కాదు.. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ వీడియో చూసినంతనే అయ్యో అనిపించేస్తుంది. 75 ఏళ్ల పెద్ద వయస్కుడి విషయంలో బస్సు కండక్టర్ వ్యవహరించిన తీరు దారుణంగా ఉండటమే కాదు.. మరీ ఇంతలా బరితెగించాలా? అన్న రీతిలో ఉందని చెప్పాలి. రాజస్థాన్ లోని జైపూర్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో కండక్టర్ దారుణంగా కొట్టింది మరెవరినో కాదు.. ఒక రిటైర్డు ఐఏఎస్ అధికారిని అన్న విషయం తెలిసినప్పుడు మనసుకు బాధ కలగటం ఖాయం. ఈ వివాదానికి సంబంధించిన ఇద్దరి వాదనల్ని విన్నప్పుడు.. అవసరానికి మించిన అత్యుత్సాహంతో వ్యవహరించిన కండక్టర్ తీరు తప్పు పట్టేలా ఉండటమే కాదు.. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ వివాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రిటైర్డు ఐఏఎస్ అధికారి అయిన 75 ఏళ్ల ఆర్ మీనా ఆగ్రా రోడ్డులోని కనోటా బస్టాప్ వద్ద దిగాల్సి ఉంది. అయితే.. కండక్టర్ ఆ విషయాన్ని చెప్పకపోవటంతో డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. ఆ క్రమంలో బస్సు తర్వాతి స్టాప్ లో ఆగింది. దీంతో.. బస్ కండక్టర్ కు రిటైర్డు ఐఏఎస్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదనపు ఛార్జి కింద రూ.109 ఇవ్వాల్సింకూడా చూడకుండా అతడిపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో.. బస్సులోని మిగిలిన ప్రయాణికులు కలుగజేసుకొని వారిని ఆపారు. ఈ తతంగాన్ని బస్సులో ఉన్న వ్యక్తి వీడియో తీశారు.
తనపై దాడి జరిగిన ఘటనపై మీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు దాడి చేసిన కండక్టర్ ను ఘన్ శ్యామ్ శర్మగా గుర్తించారు. ప్రయాణికుడిపై దాడి చేసినందుకు సదరు కండక్టర్ ను జైపూర్ సిటీ ట్రాన్స్ పోర్టు సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ తరహా మైండ్ సెట్ ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తన తప్పేమీ లేకుండానే.. దెబ్బలు తిన్న రిటైర్డు ఐఏఎస్ అధికారి వైనం ఆవేదన కలిగిస్తుందని చెప్పాలి. ఐఏఎస్ గా రిటైర్ అయి కూడా బస్సుల్లో ప్రయాణించటమంటే.. ఎంత సింఫుల్ గా ఉంటారో అర్థమవుతుందని.. అలాంటి వారికి ఈ తరహా చేదు అనుభవాలు ఎదురు కావటం ఆవేదన కలిగించే అంశంగా చెప్పాలి.