కొహ్లీ కి గవాస్కర్ చురకలు..అప్పటికి నువ్వింకా పుట్ట లేదులే!

Update: 2019-11-26 01:30 GMT
బీసీసీఐ ప్రెసిడెంట్ హోదా లో ఉన్న సౌరవ్ గంగూలీ ని ప్రసన్నం చేసుకోవాలని అనుకున్నాడో ఏమో కానీ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ వ్యాఖ్యలు విఖ్యాత క్రికెటర్, భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కు కోపాన్ని తెప్పించాయి. బంగ్లాదేశ్ తో టెస్టు సీరిస్ విజయానంతరం కొహ్లీ మాట్లాడుతూ ఒకింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

తమ వరస విజయాల గురించి కొహ్లీ మాట్లాడుతూ..రెండువేలు దశకం లో.. నాటి కెప్టెన్ గంగూలీ హయాం లో విజయాలు మొదలయ్యాయని, ఆ వరస అలాగే కొనసాగుతూ ఉందని కొహ్లీ చెప్పుకొచ్చు. అంతకు ముందు టీమిండియా టెస్టుల్లో ఎప్పుడూ నెగ్గ లేదన్నట్టుగా కొహ్లీ వ్యాఖ్యానాలు ఉన్నాయి.

అయితే అవి పూర్తిగా అసంబద్ధమైన వ్యాఖ్యలని భారత క్రికెట్ ఫ్యాన్ ఎవరైనా చెబుతారు. గంగూలీ కి ముందు రోజుల్లో కూడా టీమిండియా బోలెడన్ని టెస్టుల్లో విజయాలు సాధించింది. టీమిండియా కు ఒక దశ లో అజరుద్ధీన్ టెస్టుల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు.

మేటి జట్లను టీమిండియా ఓడించింది. అలాగే అజర్ కు ముందు కపిల్, గవాస్కర్ ల కెప్టెన్సీల్లోనూ టీమిండియా విదేశాల్లో టెస్టుల్లో నెగ్గింది. కొన్ని సార్లు సీరిస్ లను డ్రా చేయగలిగింది. ఆ విషయాన్నే గవాస్కర్ ప్రస్తావించారు.

తమ హయాంలోనే టీమిండియా అనేక టెస్టుల్లో గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ, అప్పటికి కొహ్లీ ఇంకా పుట్టి ఉండక పోవచ్చని గవాస్కర్ చురకలంటించారు.

అప్పట్లో ఏ దేశం ఆడినా కూడా టెస్టులు అంతగా ఫలితాలు వచ్చేవి కావు. వాటి మేరకు ఇండియా బాగానే ఆడింది. అదే జరగనట్టుగా కొహ్లీ వ్యాఖ్యానించడం భారత క్రికెట్ జట్టు అభిమానుల్లో కూడా అసహనాన్ని పుట్టిస్తూ ఉంది. సూపర్ పవన్ గా ఉన్న గంగూలీ ప్రాపంకం కోసం కొహ్లీ అలా మాట్లాడి ఉండవచ్చని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు.

Tags:    

Similar News