అసలే ఇది కరోనా వైరస్ టైం. బయటకొస్తే మహమ్మారి అంటుకొని కబళిస్తుంది.. ఈ మహమ్మారి ఇప్పటికే యూరప్, అమెరికాను అతలాకుతలం చేస్తోంది. వేల కేసులు.. వందలాది మరణాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా యూరప్ లోని ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, జర్మనీలలో తీవ్రత మొన్నటిదాకా బాగా ఉండేది. ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతోంది.
అయితే ఈ వైరస్ కారణంగా దాదాపు 2 నెలలుగా జనం ఇంటి నుంచి బయట అడుగు పెట్టలేదు. లాక్ డౌన్ తో మొత్తం బందీ అయిపోయారు. ఇప్పుడిప్పుడే సడలింపులు మొదలయ్యాయి. జర్మనీలోనూ జనాలను బయటకు అనుమతిస్తున్నారు. అయితే సామాజిక దూరం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.
ఇంతటి పీక్స్ టైంలో జర్మనీ దేశంలో యువత, పెద్దవారు పార్టీ చేసుకున్నారు. పాటలకు స్టెప్పులేశారు. మందు, విందుతో చిందేశారు. మంచి పాటలకు కూనిరాగాలు తీస్తూ డ్యాన్సులతో అదరగొట్టారు.
మరి వారికి వైరస్ వ్యాపించదా అంటే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఒక పెద్ద మైదానాన్ని ఎంపిక చేసుకొని అక్కడ డీజే సౌండ్స్ పెట్టించి ఎవరి కారులో వారు ఉండి ఇలా పార్టీని ఎంజాయ్ చేశారు. ఇలా కరోనా సోకకుండా జర్మన్లు అందరూ తమ తమ కారులోనే ఉండి పార్టీ చేసుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పార్టీలు, పబ్బులకు దూరంగా ఉన్న వేళ జర్మన్లు చేసుకున్న ఈ పార్టీ వైరల్ అయ్యింది. వారి క్రియేటివిటీ పార్టీకి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇలాంటి పార్టీలే అంతటా చేసుకునేలా పరిస్థితులు ఉండొచ్చంటున్నారు.