అక్క‌డ బీరు కోసం పైప్ లైనే వేసేశారు

Update: 2017-05-31 08:38 GMT
మంచినీటి కోసం పైప్ లైన్ వేయ‌టం.. ముడిచ‌మురు.. గ్యాస్ స‌ర‌ఫ‌రా కోసం పైప్ లైన్ వేయ‌టం తెలిసిందే.కానీ.. బీరు కోసం కూడా పైప్ లైన్ వేస్తారా? అన్న సందేహం అక్క‌ర్లేదు. ఎందుకంటే.. జ‌ర్మ‌నీలోని వాకెన్ ప‌ట్ట‌ణంలో ఇలాంటి పైప్ లైన్ ను వేసేస్తున్నారు.

ఇంత‌కీ బీరు కోసం పైప్ లైన్ వేయాల్సిన అవ‌స‌రం ఏముందంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. జ‌ర్మ‌నీలోని వాకెన్ ప‌ట్ట‌ణంలో ప్ర‌తి ఏడాది ఓపెన్ ఎయిర్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హిస్తుంటారు. ఈ కార్య‌క్ర‌మానికి స్థానికులే కాదు.. వేర్వేరు ప్రాంతాల నుంచి భారీగా ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుక‌లు ఆగ‌స్టు 5 నుంచి స్టార్ట్ కానున్నాయి.

అయితే.. ఈ వేడుకల్లో మ‌ద్యం సేవించ‌టం కూడా ఒక భాగ‌మే. ఇక్క‌డికి వ‌చ్చిన వారంతా బీరును విప‌రీతంగా తాగేస్తుంటారు. అయితే.. స‌మ‌స్య ఏమిటంటే.. ఈ వేడుక‌ల్ని ప‌చ్చ‌టి పొలాల్లో నిర్వ‌హిస్తుంటారు. వేడుకల‌కు వ‌చ్చినోళ్లు.. బుద్ధిగా తాగేయ‌కుండా.. మ‌ద్యం సీసాల్ని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పారేస్తున్నార‌ట‌. దీంతో.. మా గొప్ప చిరాగ్గా మారింద‌ట‌. అందుకే.. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు వీలుగా..  బీరు కోసం ఏకంగా ఒక పైప్ లైన్ వేస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచించిన కార్య‌క్ర‌మ నిర్వాహ‌కులు.. ఆ ప‌ని మొద‌లెట్టేశారు. ఈ వేడుక‌కు వ‌చ్చే వారు పైప్ లైన్ ద్వారా వ‌చ్చే బీరును మాత్ర‌మే తాగాలే కానీ.. సీసాలు.. గ్లాసులు తీసుకొస్తామంటే మాత్రం ఊరుకోర‌ట‌. పైపుల్లో నుంచి మంచినీళ్లు రావ‌టం తెలుసుకానీ.. ఇలా బీరు రావ‌టాన్ని మ‌రి.. వేడ‌క‌కు వ‌చ్చే వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఏమైనా ఈ ముచ్చ‌ట‌ మందుబాబులకు తెలిస్తే మాత్రం.. గుట‌క‌లేస్తూ వెళ్ల‌టం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News