వ్యాక్సిన్ కోసం అగ్రరాజ్యాల యుద్ధం!

Update: 2020-07-20 05:45 GMT
ప్రపంచమంతా ఇప్పుడు ఒక్కటే బాధ. అదే కరోనా.. దాని నుంచి కాపాడుకోవడమే అందరి ముందున్న కర్తవ్యం. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం. దీంతో అన్ని దేశాలు దీన్ని కనిపెట్టడానికి శాయశక్తులు ఒడ్డుతున్నాయి.

మొట్టమొదటగా ఎవరు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తారో వారే ఈ కరోనా వార్ లో విజేతలు అవుతారు. కోట్ల మందికి ప్రాణదాతలవుతారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతారు. అందుకే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అగ్రరాజ్యాల మధ్య వ్యాక్సిన్ వార్ జరుగుతోంది.

అమెరికా, కెనడా, బ్రిటన్ చేస్తున్న టీకా పరిశోధనలకు అడుగడుగునా రష్యా, చైనా అడ్డుతగులుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవలే టీకాకు సంబంధించిన సమాచారాన్ని రష్యా ఇంటెలిజెన్స్ హ్యాకింగ్ చేసిందని అమెరికా, బ్రిటన్, కెనడాలు ఆరోపించాయి. ఈ ఆరోపణలను రష్యా ఖండించింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా క్లినికల్ ట్రయల్స్ దశకి వచ్చిన వ్యాక్సిన్ లు 25వరకు ఉంటే అందులో అమెరికా ఫార్మా కంపెనీలవి 9 ఉన్నాయి. చైనాకు చెందినవి నాలుగు ఉన్నాయని డబ్ల్యూ.హెచ్.వో తెలిపింది.

వ్యాక్సిన్ కనిపెట్టి అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలవాలని ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందుకే అమెరికా, కెనడా, బ్రిటన్ ఒక జట్టుగా పనిచేస్తున్నాయి. చైనా, రష్యాలు వాటిని అడ్డుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి.

ఇప్పటికే అమెరికాలో కరోనాటీకాపై విస్తృత పరిశోధనలు చేసిన బింగ్ ల్యూ ను మేలో గుర్తుతెలియని దుండగులు కాల్చేశారు. ఈ చైనాకు చెందిన బింగ్ అమెరికాలోని పిట్స్ బర్గ్ వర్సిటీలో ప్రొఫెసర్. ఇతడు కీలక వ్యాక్సిన్ పరిశోధనలో ఉండగా హతమవ్వడంతో ఇది చైనా పనే అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తం వ్యాక్సిన్ వార్ అగ్రరాజ్యాల మధ్య సెగలు కక్కుతోంది.
Tags:    

Similar News