ఆంక్షల కత్తి కొనల మధ్య బతికే ముస్లింలపై మరో ఆంక్షను విధించారు ఆ మత పెద్దలు. చిన్న చిన్న అంశాలకు సైతం తీవ్రస్థాయిలో స్పందించే ముస్లిం మత పెద్దలు రాజస్థాన్ లో మరో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి సందర్భంగా డీజే.. మ్యూజిక్ సిస్టంతో పెళ్లిళ్లు చేసుకునే వారిపై కన్నెర్ర చేస్తున్నాయి. పెళ్లి వేడుక అంటే తమ స్థాయికి తగ్గట్లుగా ఇలాంటి మ్యూజిక్.. డీజే సిస్టం పెట్టుకొని పెళ్లిళ్లు చేసుకోవటం కామన్.
కానీ.. ఇలాంటివేమీ తమ మతంలో లేవని చెబుతున్నారు రాజస్థాన్ లోని కోటాకు చెందిన ముస్లిం మత పెద్దలు. పెళ్లిళ్ల సందర్భంగా ఏర్పాటు చేసే డీజేలు.. మ్యూజిక్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందికరంగా మారటంతో పాటు.. పేద ముస్లింలకు కొత్త కష్టాల్ని తెచ్చి పెడుతుందని.. అలాంటి తిప్పలు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా వివాహమహోత్సవాల్లో ఆడంబరాలకు చెక్ చెప్పాలని అక్కడి ముస్లిం పెద్దలు నిర్ణయించారు.
ఇందుకు తగ్గట్ల.. ఆడంబరంగా పెళ్లి చేసుకునే ముస్లిం జంటలకు నిఖ్కా పక్కా చేసే నిఖ్కా ఫారాలు ఇవ్వమని చెబుతున్నారు. ఇలాంటి కటువైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా.. ఆడంబరాలకు చెక్ చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రతి విషయంలోనూ ఆంక్షల్ని అమలు చేయటం అంత సరైన చర్య కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.